ఢిల్లీలోని కీలకమైన ప్రాంతాల్లో భారీ భద్రత
డ్రోన్‌లు, మిస్సైళ్లతో గురువారం రాత్రి పాకిస్థాన్ దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ‘ప్రభుత్వ భవనాలు, నీటి శుభ్రత ప్లాంట్‌లు, కోర్ట్‌లు, విదేశీ అంబెసీల ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నాం. అదనపు బలగాలు, పారామిలిటరీ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. పోలీసులు కూడా రైల్వే స్టేషన్లు, మాల్స్, పార్క్‌లు, మెట్రో స్టేషన్‌ల దగ్గర అధిక భద్రతను కల్పిస్తున్నారు. రాత్రి సమయంలో చేపట్టి గస్తీలను కూడా మరింత అధికం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సెన్సిటివ్ ప్రాంతాలను మరింత నిశితంగా పరీశిలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story