ప్రస్తుతం ఎన్డీఏ 198 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.... ... బీహార్ లో ఢంకా భజాయించిన నితీశ్
x

ప్రస్తుతం ఎన్డీఏ 198 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాఘట్‌బంధన్ కూటమి 39 స్థానాల్లో కొనసాగుతోంది. ఇక RJD నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తన నియోజకవర్గం రఘోపూర్‌లో 585 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పేలవ ప్రదర్శనపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పందించారు. తక్షణం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాల్సి ఉందన్నారు. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతుందన్నా లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. తొలగించిన ఓటర్లలో ఎక్కువ మంది పేద, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. “నేను అనుమానించింది నిజమైంది. 62లక్షల ఓట్లను తొలగించారు. 2 లక్షల ఓట్లను కలిపారు.’’ అని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) విశ్వసనీయతపై కూడా ఆయన సందేహాలను లేవనెత్తారు. ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టి ఓట్లను తొలగించిన ఈసీ బీజేపీకి సహకరించిందని ఆరోపించారు.

Read More
Next Story