హింసాత్మక ఘటనలపై ఈసీకి మాజీ ఎంపీ కనకమేడల

పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా వ్యవహరిస్తూ.. ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్‌ను సమస్యాత్మకంగా మారుస్తున్నారని ఆరోపించారు. పల్నాడు, పుంగనూరు, మాచర్ల, తాడిపత్రిలో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయని వివరించారు. ‘‘మాచర్ల చెందిన నేతను వైసిపి నేతలు చంపేశారు. పల్నాడు లో ఎంపీ లావు కృష్ణదేవరాయల వాహనాల పై దాడి చేశారు. పుంగనూరు,తడిపత్రిలో మోడల్ కోడ్ కండక్ట్ ను ఉల్లంఘించారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైసిపి నేతలు టిడిపి నేతల పై దాడుల చేశారు.

స్పీకర్ తమ్మినేని సతీమణి సహితం బూత్ క్యాప్చర్ చేశారు. తెనాలి ఎమ్మెల్యేలే బూత్‌లో ఓటరు పై దాడి చేశారు. కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లను తీసుకెళ్ళారు. పోలింగ్ బూత్‌లో లైన్‌లో ఉన్న ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ బూత్‌లో ఉన్నవారు ప్రశాంతంగా ఓటు వేసుకునే వాతావరణాన్ని నెలకొల్పాలి. ఈ విషయాలను పేర్కొంటూ చంద్రబాబు నాయుడు లేఖ రాశారు అది కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాను’’ అని ఆయన వివరించారు. అనంతరం దౌర్జన్యం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్థానిక పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Read More
Next Story