పోలింగ్ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు
మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందన్నారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి కేంద్ర బలగాలు వచ్చాయని, 60వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. తనిఖీలకు సంబంధంచి 8వేలకు పైగా కేసులు నమో చేశామన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని వికాస్‌రాజ్ తెలిపారు.
Next Story