టీటీడీకి 'రియల్ ఎస్టేట్' తో 'అనుబంధం అన్యాయం..

సీఎం చేసిన సూచనలు టీటీడీ దేశంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. దీనిని సమీక్షించాలని సిఐటియు డిమాండ్ చేసింది.;

Update: 2025-04-03 08:47 GMT

తమిళనాడులో వెంచర్ల వద్ద రియల్ ఎస్టేట్ (Real Estate ) యజమానులు ఆలయాలు నిర్మిస్తున్నారు. టీటీడీ వాటి బాధ్యత తీసుకోవాలని భావించడం అన్యాయం. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. వ్యాపార అవసరాలకు నిర్మించే ఆలయాల బాధ్యత టీటీడీ తీసుకోవడం వాంఛనీయం కాదని సీఐటీయు (సీటు) రాష్ట్ర నేత కందారపు మురళి హితవు పలికారు.

"అమరావతిలో జరిగిన టిటిడి సమీక్ష సమావేశంలో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జి స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తాను వెంచర్లు చేపట్టిన చోట నిర్మిస్తున్న ఆలయ ఆలయ నిర్వహణ బాధ్యతలు టీటీడీ తీసుకోవాలని సీఎం. ఎన్ చంద్రబాబు ఆదేశించడం సమంజసం కాదు. ఈ రకమైన ధోరణి దేశంలో అనేక వివాదాలకు కేంద్రంగా టిటిడి మారుతుంది" అని సీఐటీయూ నేత కందారపు మురళి ఆందోళన వ్యక్తం చేశారు.

"వ్యాపార అవసరాల కోసం వ్యక్తులు నిర్మించే ఆలయాల నిర్వహణ బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిన అవసరం లేదు" అని కందారపు మురళి స్పష్టం చేశారు.

కల్యాణ మండపం అద్దె రూ.1

దేశంలో కల్యాణ మండపాలు నిర్మించి, వాటి నిర్వహణ చేయలేక టీటీడీ చేతులెత్తేసిన విషయాన్ని కందారపు మురళి గుర్తు చేశారు. గతంలో కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో నిర్మించుకున్న కళ్యాణ మండపాన్ని టీటీడీ నిర్వహించలేక కేవలం నెలకు రూపాయి లీజుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కళ్యాణ మండపాల నిర్వహణే చేతగాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేశంలో పలుచోట్ల ఆలయాలు నిర్మిస్తున్నారని వాటి నిర్వహణ కూడా ఇబ్బందికరమైందని అన్నారు. ఇవేకాకుండా ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థలు చేపట్టే ఆలయాలను కూడా టీటీడీ బాధ్యత తీసుకోవాలనుకోవడం సమంజసం కాదు. ఈ అంశంపై పునరాలోచన జరపాలని కందారపు మురళి కోరారు.

సమస్యల పరిష్కరించండి

దశాబ్దాలుగా టీటీడీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా, వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని సిఐటియు నేత కందారం మురళి నిరసన వ్యక్తం చేశారు.

"ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులు రెగ్యులరైజ్ చేయమని కోర్టుల ఆదేశాలు ఉన్నాయి. టీటీడీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు" అని మురళీ ఆరోపించారు. రెగ్యులరైజ్ ఆదేశాలు ఉన్నటువంటి అన్ని విభాగాల్లోని వారిని రెగ్యులరైజ్ చేయాలని, ఈ అంశాన్ని టిటిడి సమావేశంలో చర్చించకపోవడం సరైంది కాదని, టీటీడీలో కార్మికులకు సంబంధించి సర్వీస్ సంబంధిత అంశాలపై పరిష్కారం చేయాలని కందారపు మురళి విజ్ఞప్తి చేశారు. భక్తులు,ఉద్యోగులు, యాత్రికులు, తిరుపతి - తిరుమల ప్రాంతాలలోని అభివృద్ధి , మౌలిక సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కందారపు మురళి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News