భద్రాద్రి రాముడికి టీటీడీ కానుక..!
టిటిడి చైర్మన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతించారు.;
By : Dinesh Gunakala
Update: 2025-04-06 11:12 GMT
శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యానోత్వవాన్ని
పురస్కరించుకుని స్వామి, అమ్మవారికిి టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు.
ప్రతి సంవత్సరము టీటీడీ తరుపున భద్రాద్రి రాములోరికి
పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. భద్రాచలం ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఛైర్మన్ కు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలయ ఈవో ఎల్ .రమాదేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆతరువాత సీతారాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం టీటీడీ ఛైర్మన్ దంపతులు సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు.