TIRUMALA || తిరుమల శ్రీవారి సేవలో మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి..!
సి.పి. రాధాకృష్ణన్ కి టిటిడి అధికారులు ఘన స్వాగతం;
By : Dinesh Gunakala
Update: 2025-08-28 06:00 GMT
తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో గవర్నర్ రాధాకృష్ణన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు గవర్నర్ రాధాకృష్ణన్‌ను శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ పర్యటనలో గవర్నర్ రాధాకృష్ణన్‌తో పాటు రాష్ట్ర మంత్రి నారాయణ, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా ఉన్నారు.
వీరంతా కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది.