TIRUPATI || ఎస్వీయూ క్యాంపస్‌లో బోనులో చిక్కిన చిరుత

తిరుపతి యూనివర్సిటీ పరిధిలో కొన్ని రోజుల నుండి విద్యార్థులకు నిద్ర లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.;

Update: 2025-04-06 06:39 GMT


తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ
పరిధిలోని విద్యార్థులను, స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న చిరుత ఎట్టకేలకు దొరికిపోయింది. వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ శారదంబా భవనం వద్ద పెట్టిన బోనులో ఉన్న కుక్కను తినేందుకు వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. గత కొంత కాలంగా ఓ చిరుత భయ భ్రాంతులకు గురిచేస్తుంది. ఈ తరుణంలో రెండు రోజుల కిందట ఆ చిరుతను పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేశారు. అయితే, ఈరోజు వేకువ జామున చిరుత ఆ బోనులో చిక్కుకుంది. సమాచారం అందుకున్న వైల్డఫ్ అధికారులు చిరుతను యూనివర్సిటీ నుంచి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.


Tags:    

Similar News