Tirumala || శ్రీవారి ఆలయాన్ని గేమ్ కు వాడుకున్న Roblox

ఓ గోమింగ్ యాప్ శ్రీవారి యాత్రికుల మనోభావాలను దెబ్బతీస్తున్న వ్యవహారం వెలుగు చూసింది.;

Update: 2025-06-26 09:30 GMT


ఓ గేమింగ్ యాప్ ఒక గేమ్ కోసం తిరుమల శ్రీవారి ఆలయాన్ని వాడుకుని అలజడి సృష్టించింది.
తిరుమల యాత్ర పేరుతో ఒకే గేమ్  ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ Roblox తయారు చేసింది. శ్రీవారి ఆలయ అంతర్భాగం మొత్తం ఈ గేమింగ్ యాప్ లో వాడడం వల్ల భద్రతా సమస్య కూడా తెరమీదకు వచ్చింది.
Roblox తయారు చేసిన యాప్ పై టీటీడీకి ఫిర్యాదు అందింది. దీనిని పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు కూడా తీవ్రంగా స్పందించారు.
"ఇది యాత్రికుల మనో భావాలు దెబ్బతినడమే కాదు. ఆలయ భద్రతకు కూడా ప్రమాదం" అని చైర్మన్ బీఆర్. నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గేమింగ్ యాప్ పై చర్యలకు టీటీడీ విజిలెన్స్ అధికారులను బీఆర్. నాయుడు ఆదేశించారు.
మోసం ఇలా.
Roblox యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన యాప్ లో బ్యాక్ గ్రౌండ్ తిరుల ఆలయాన్ని వాడుకున్నారు. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం మంద్రస్ధాయిలో వినిపిస్తుంటే, ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రతి అణువులోకి వెళుతున్నట్లు యానిమేషన్ మనిషిని ఉంచారు. అంతేకాకుండా, ఈ గేమింగ్ యాప్‌లో తిరుపతి నుంచి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం, దైవదర్శనం వంటి దృశ్యాలను పొందుపరిచారు.
చర్యలు తీసుకుంటాం.
తిరుమల ఆలయం నేపథ్యంగా గేమింగ్ యాప్ తయారు చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు హెచ్చరించారు. యాత్రికుల భక్తిని ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్‌ ద్వారా డాలర్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందిందని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు.
శ్రీవారిపై వచ్చిన గేమ్ డిజైన్ చేసిన సంస్థపై కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు.
శ్రీవారి ఆలయంలోని ప్రతి అణువణువును గేమ్ డిజైన్‌లో పొందుపరచడం ద్వారా ఆలయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. "ఇటువంటి గేమ్‌లు కొనసాగిస్తే ఉగ్రవాదులకు శ్రీవారి ఆలయం ఎలా ఉంటుందో సులభంగా తెలిసిపోతుంది" అని ఆయన అన్నారు. వెంటనే ఆ గేమ్ అకౌంట్‌ను తొలగించాలని టీటీడీని కోరానని తెలిపారు. భవిష్యత్తులో టీటీడీపై ఏమైనా చేయడానికి భయపడే విధంగా చర్యలు చేపట్టాలని టీటీడీని కోరామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయా ఆలయాలపై చాలా గేమ్ డిజైన్‌లను చేసి ఆన్‌లైన్‌లో వదిలారని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ విషయాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాలని ఆయన కోరారు.


Tags:    

Similar News