కొండపై 6 అడుగుల తాచు భక్తకోటి ఉలికిపాటు..!
తిరుమలలో భారీ నాగుపాము కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు.;
By : Dinesh Gunakala
Update: 2025-04-03 10:43 GMT
తిరుమలలో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని బి-టైప్ క్వార్టర్స్ రూమ్స్ వద్ద 06 అడుగుల నాగుపామును స్థానికులు గుర్తించారు. భారీ నాగు కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. వెంటనే టీటీడీకి చెందిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. నాగు పామును అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు, భక్తులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.