హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, పవన్

ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత జరిగే ఎన్‌డీఏ కూటమి సమావేశానికి కూడా చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారు. చండీగడ్‌లో మధ్యాహ్నం 3 గం. కు ఈ సమావేశం ప్రారంభమవుతుంది.

Update: 2024-10-17 10:46 GMT

హర్యానాలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోది, హోమ్ మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరి, రాజ్‌నాథ్ సింగ్ తదితరులతోపాటు ఎన్‌డీఏలో భాగస్వాములు కావటంతో చంద్రబాబు, పవన్ కూడా ప్రత్యేక అతిథులుగా పొల్గొన్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత జరిగే ఎన్‌డీఏ కూటమి సమావేశానికి కూడా చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారు. చండీగడ్‌లో మధ్యాహ్నం మూడుగంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో లోక్ జనశక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్, జేడీయూ నాయకుడు రాజీవ్ రంజన్, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మాలతో సహా 13 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, 16 మంది ఉపముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు.

మహారాష్ట్ర ఎన్నికలలో సంకీర్ణ కూటమి మధ్య సీట్ల పంపిణీ ఖరారు దృష్ట్యా ఈ ఎన్‌డీఏ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా చండీగడ్‌లో ఉన్నారు. మహారాష్ట్రలోని అధికార కూటమిలో ఉన్న బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం, అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గం మధ్య సీట్ల పంపిణీ గురించి ఇవాళే ఇక్కడ ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. సంవిధాన్ కా అమృత్ మహోత్సవ్, ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు పూర్తికావటంవంటి విషయాల గురించి ఎన్‌డీఏ సమావేశంలో చర్చించనున్నారు.

Tags:    

Similar News