హలాల్ ఉత్పత్తుల అమ్మకాలపై యోగి నిషేధం
అయోధ్య రామాలయ నిర్మాణంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను కీలక పాత్ర పోషించిందన్న యూపీ సీఎం..
రాష్ట్రంలో హలాల్ (ముస్లింలు ఇస్లామిక్ చట్టం ప్రకారం చేసే) సర్టిఫైడ్ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించామని ఉత్తరప్రదేశ్(Utter Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) తెలిపారు. ఈ ఉత్పత్తుల అమ్మకాల వల్ల వచ్చే లాభాలను మతమార్పిడి, లవ్ జిహాద్, ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 21) గోరఖ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి మాట్లాడారు.
'రాజకీయ ఇస్లాంకు వ్యతిరేకంగా యోధుల పోరాటం'
'రాజకీయ ఇస్లాం'(Political Islam)ను ప్రోత్సహిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్, మహారాణా ప్రతాప్, మహారాణా సంగ వంటి గొప్ప యోధులు 'రాజకీయ ఇస్లాం'కు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు.
అయోధ్య రామాలయం నిర్మాణంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్రను యోగి ప్రస్తావించారు. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, ఇండియా బ్లాక్ సభ్యులు ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించినా.. ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆదిత్యనాథ్ ప్రశంసించారు.
వికసిత్ భారత్‌కు పునాదిగా నిలిచే ఐదు ప్రధాన అంశాలు(సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ వస్తువుల ద్వారా స్వావలంబన పౌర బాధ్యత) గురించి వివరించారు.