కుటుంబ కలహాలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ఏమన్నారు?
ఆర్జేడీ శాసనసభా పక్ష నేతగా తేజశ్వి యాదవ్..
ఎట్టకేలకు తన కుటుంబంలో కొనసాగుతోన్న వైరంపై ఆర్జేడీ(RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad) మౌనం వీడారు. అది తమ కుటుంబ విషయమని, కూర్చుని పరిష్కరించుకుంటామని చెప్పారు. సోమవారం (నవంబర్ 17) కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేలు లాలూను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొడుకు తేజస్విని అభినందిస్తూనే..‘‘ఎన్నికల్లో "చాలా కష్టపడి" పనిచేశానని తేజస్వి చెప్పారు. కానీ కేవలం 25 స్థానాలను మాత్రమే గెలువగలిగాం.’’ అని అన్నారు. లాలూ భార్య రబ్రీ దేవి, పెద్ద కుమార్తె మిసా భారతి, జగదానంద్ సింగ్, ఇతర ఆర్జేడీ నాయకులు హాజరైన ఈ సమావేశంలో ఆర్జేడీ శాసనసభా పక్ష నేతగా తేజశ్విని (Tejashwi Yadav) ఎన్నుకున్నారు.
'జైచంద్'లకు తేజ్ ప్రతాప్ హెచ్చరిక..
జనశక్తి జనతాదళ్ అధినేత, లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన సోదరి రోహిణి(Rohini) ఆచార్యకు మద్దతుగా నిలిచారు. ఆమె తన సోదరుడు తేజస్వి యాదవ్, ఆయన సహాయకుడు సంజయ్ యాదవ్ ఇటీవల తనను అవమానించారని బహిరంగంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. "జైచంద్‌లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాని పర్యావసానం ఎదుర్కోక తప్పదు,’’ అని మండిపడ్డారు. మహువా స్థానం నుంచి పోటీచేసిన రోహిణి ఓడిపోయిన విషయం తెలిసిందే.
‘‘నాలా చేయగలరా?’’
‘‘ మా నాన్నకు మురికి కిడ్నీ ఇచ్చి దానికి ప్రతిఫలంగా కోట్ల రూపాయలు, అసెంబ్లీ టికెట్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారు. నా భర్త, అత్తమామల ఆమోదం, నా ముగ్గురు పిల్లల శ్రేయస్సును కూడా పట్టించుకోకుండా.. నా తండ్రి ప్రాణాలను కాపాడటానికి నా కిడ్నీని త్యాగం చేశాను. దానికి తక్కిన ప్రతిఫలం నాపై నిందలు. నా సోదరుడు తేజస్వి కాని, ఆయన హర్యాన స్నేహితుడు సంజయ్ యాదవ్‌గాని కిడ్నీని మరొకరికి దానం చేయగలరా?" అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
కొన్ని సంవత్సరాల క్రితం లలూకు కిడ్నీని దానం చేసిన రోహిణి.. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో సరన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.