‘దీదీ’ అని పిలుస్తూ.. యువతిపై అత్యాచారానికి పాల్పడిన గజదొంగ
బస్టాండ్ లో సంఘటన జరగడంతో ఉలిక్కిపడిన మహారాష్ట్ర;
By : Praveen Chepyala
Update: 2025-02-27 06:35 GMT
పుణెలో స్వర్గేట్ లో గల రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఓ యువతిపై అత్యాచారం జరగడం మహారాష్ట్రలో కలకలం రేగింది. నగరం నడిబొడ్డున్న ఉన్న బస్ స్టాండ్ లో ఈ సంఘటన జరగడంతో ప్రభుత్వం, ప్రజలు ఉలిక్కి పడ్డారు.
నిందితుడు దత్తాత్రేయ రామదాస్ గడే(36) ఇంటి నుంచి సిటీకి వస్తున్న యువతి(25)తో మాటలు కలిపిన నిందితుడు నిర్మానుష్యంగా ఉన్న ఖాళీ బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
దత్తాత్రేయకు నేరచరిత్ర ఉందని, అతను 2019 నుంచి బెయిల్ పై బయట ఉన్నాడని తెలిసింది. అతడిపై డజన్ కు పైగా చోరీ కేసులు ఉన్నాయని, ఈ కేసులన్నీ కూడా పుణె, అహల్యనగర్ జిల్లాలో ఉన్నాయని తెలుస్తోంది.
దీనితో ప్రతిపక్ష శివసేన(యూబీటీ) నిరసనలకు పిలుపునిచ్చింది. సీఎం ఫడ్నవీస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఆయన దగ్గరే హోంమంత్రిత్వ శాఖ ఉంది.
ఈ సంఘటన తరువాత ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది. బస్టాండ్ ఉన్న గార్డులందరిని తొలగించమని ఆదేశాలు జారీ చేసింది. అలాగే రవాణా మంత్రిత్వశాఖ కూడ అంతర్గత విచారణను ప్రారంభించింది.
‘అక్క’ అని పిలుస్తూ..
బాధిత మహిళా ప్రకారం.. సతారా వెళ్లడానికి ఉదయం 5.45 నిమిషాలకు నిలుచున్న సమయంలో ఒక వ్యక్తి దీదీ అని పిలుస్తూ.. బస్సు పక్కన ఉన్న మరో ప్లాట్ ఫాం మీదకు వచ్చినట్లు చెప్పి తనను పక్కకు తీసుకెళ్లాడు.
బస్టాండ్ ప్రాంగణంలో ఆగిన శివ్ షాహీ ఏసీ బస్సు దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే అందులో లైట్లు వెలగకపోవడంతో బస్సులోకి వెళ్లాడానికి బాధితురాలు నిరాకరించింది.
అయితే సతారా వెళ్లే బస్సు ఇదే అని నమ్మించడంతో అందులోకి వెళ్లడంతో బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం జరిగిన తరువాత నిందితుడు బాధితురాలని బెదిరించాడని, పోలీసులకు చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడని తెలిసింది.
మహారాష్ట్ర రోడ్ ట్రాన్ పోర్ట్ సంస్థ నివేదిక ప్రకారం.. బాధిత మహిళ సోలాపూర్ నుంచి ఉదయం 3.40 నిమిషాలకు పుణె చేరుకున్నట్లు వెల్లడించింది. తరువాత జ్యూస్ షాప్ పక్కన ఉన్న బస్సులోకి ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్లు కూడా తన నివేదిక లో పేర్కొంది.
కండక్టర్ అని నమ్మించాడు..
కొన్ని నివేదికల ప్రకారం.. నిందితుడు, యువతిని తాను బస్సు కండక్టర్ అని నమ్మించాడు. నేరం జరిగిన దాదాపు 4 గంటల తరువాత ఆర్టీసీ అధికారులకు తెలిసింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సామ్రాట్న పాటిల్ మాట్లాడుతూ.. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినట్లు.. బాధితురాలు, నిందితుడి వెంట వెళ్తున్నట్లు అందులో రికార్డు అయినట్లు తెలిసింది.
ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని, బస్సులు తిరుగుతున్నాయని డీసీపీ చెప్పారు. అయితే ఈ సంఘటన జరిగిన తరువాత ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్పలేదని, బస్సులో సొంత ఊరుకు ప్రయాణం ప్రారంభించిందని, తన స్నేహితుడికి ఫోన్ లో జరిగిని విషయం చెప్పిందని డీసీపీ చెప్పారు.
అయితే స్నేహితుడు తనకు ధైర్యం చెప్పడంతో తిరిగి సిటీ లిమిట్స్ లో బస్సు దిగి పోలీస్ స్టేషన్ కు చేరుకుందని డీసీపీ చెప్పారు.
ఎనిమిది ప్రత్యేక బృందాల ఏర్పాటు..
కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు నిందితుడు గాడే అని గుర్తించారు. అతడిపై శికారపూర్, షిరూర్ పోలీస్ స్టేషన్ లో చోరీ కేసులు నమోదయ్యాయి. ఘటన జరిగిన తరువాత నిందితుడిని పట్టుకోవడానికి ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ చెప్పారు.
అతడిపై 2019 నుంచి అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. చివరగా 2024 లో ఓ చోరీ కేసులో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. దీనిపై బుధవారం పోలీసులు ఇంటరాగేట్ చేశారు.
మరణ శిక్షకు అర్హుడు
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ మాట్లాడుతూ.. పుణె పోలీస్ కమిషనర్ త్వరగా విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ‘‘ ఈ సంఘటన బాధాకరమైనది, కోపం తెప్పించేది, అవమానకరమైనది, నిందితుడు మరణశిక్షకు అర్హుడు’’ అన్నారు.
ఈ ఘటన పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బస్టాండ్ లో జనం ఒకపక్కగా ఉండగా యువతిని అత్యాచారం చేయడం ఏంటనీ ప్రశ్నలు గుప్పించారు. దగ్గర్లలోనే పోలీస్ స్టేషన్ ఉందని, అయిన నేరస్థులు రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని అన్నారు.