గ్రూప్ - 2 అభ్యర్థులకు TGPSC గుడ్ న్యూస్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-2 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం ఎడిట్ ఆప్షన్ సదుపాయాన్ని తీసుకువచ్చింది.

By :  Vanaja
Update: 2024-06-14 13:12 GMT

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-2 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం ఎడిట్ ఆప్షన్ సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ ఎడిట్ ఆప్షన్ సదుపాయం జూన్ 16 ఉదయం 10 గంటల నుండి జూన్ 20 సాయంత్రం 5 గంటల వరకు కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో అందుబాటులో ఉంటుంది అని పేర్కొంది.

అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో చేసిన ప్రతి ఎంట్రీని సరిచూసుకోవాలని, అవసరమైన చోట దిద్దుబాట్లు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ ఫైనల్ అని, అప్లికేషన్‌ ను సవరించడానికి తదుపరి అభ్యర్థనలను స్వీకరించబోమని TGPSC స్పష్టం చేసింది.

“ఈ డేటా ఫైనల్ సెలక్షన్ కి పరిగణించబడుతుంది కాబట్టి అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణలు చేస్తే, వారు సంబంధిత సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాలి అంటే, SSC, ఆధార్ కార్డ్ మొదలైనవి" అని తెలిపింది.

అప్లికేషన్‌ను సవరించిన తర్వాత అన్నీ కరెక్టుగా ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని సూచించింది. అలాగే అభ్యర్థులు కరెక్షన్స్ చేసిన అప్లికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలని, భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం వాటిని భద్రపరుచుకోవాలని తెలిపారు.

40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న, రాయడంలో ఇబ్బంది ఉన్న పిడబ్ల్యుడి అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ సదుపాయాన్ని ఉపయోగించి అపెండిక్స్-3ని అప్‌లోడ్ చేయాలని కోరారు. జూన్ 20 గడువులోపు చెల్లుబాటు అయ్యే అపెండిక్స్-3 ని అప్‌లోడ్ చేసిన అభ్యర్థులు నిబంధనల ప్రకారం స్క్రైబ్ లేదా కంపెన్సేటరీ సమయాన్ని అందించడానికి పరిగణించబడతారు అని టీజీపీఎస్సీ వెల్లడించింది.

Tags:    

Similar News