గ్రూప్-2 తోపాటు మరో పరీక్ష కూడా వాయిదా!!

తెలంగాణ సచివాలయంలో శుక్రవారం గ్రూప్ 2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు.

By :  Vanaja
Update: 2024-07-19 12:54 GMT

తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ మల్లు రవి వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో తేదీలు ప్రకటిస్తుందని తెలిపారు. డిసెంబరులో గ్రూప్-2 నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించిందని అభ్యర్థులు చెప్పారు. గ్రూప్-2 పోస్టుల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా, తెలంగాణ సచివాలయంలో శుక్రవారం గ్రూప్ 2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. చర్చల అనంతరం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి భట్టి ఫోన్ చేశారు. డిసెంబరులో గ్రూప్-2 పరీక్షల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం అభ్యర్థులకు చెప్పారు. తర్వలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అధునాతన టెక్నాలజీతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని భట్టి చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తామన్నారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు.

"హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ లో పాఠాలు బోధిస్తారు.. ప్రిపేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల గ్రూప్-2 తోపాటు మరో పరీక్ష కూడా వాయిదా!!నుంచి ఆన్లైన్లోనే ప్రశ్నలు వేయవచ్చు... అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇకనుంచి అశోక్ నగర్ లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తాం, మీరు మా బిడ్డలు.. రాష్ట్ర సంపద.. మీ మేధస్సు నిలువు ఉపయోగం కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన... ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది పరిష్కరిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుంది.. కానీ మేము అలా ఆలోచించడం లేదు. మా బిడ్డలు స్థిరపడాలి వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నాం. గ్రూప్ 2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి.. కేసుల పాలైతే మీరే నష్టపోతారు.. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడవద్దు" అని భట్టి విక్రమార్క అభ్యర్థులకు సూచించారు.

రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని మార్చి నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రూప్ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1,388 గ్రూప్ -3 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే, డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజుల మాత్రమే వ్యవధి ఉండటంతో వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. వీరి అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసేందుకు నిర్ణయించింది. దీనితో పాటు గ్రూప్ 3 పరీక్షలు కూడా వాయిదా వేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గ్రూప్-2 అభ్యర్థులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News