నామినేటెడ్ పోస్టుల జాతర... 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

తెలంగాణ ప్రభుత్వం భారీగా నామినేటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టింది. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

By :  Vanaja
Update: 2024-07-08 06:59 GMT

తెలంగాణ ప్రభుత్వం భారీగా నామినేటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టింది. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చాలా మంది ఆశావహులు ఎంపి ఎన్నికల కు ముందే నామినేటేడ్ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీలో చురుగ్గా పని చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఈ పదవులను అప్పగించారు. ఎన్నికలవేళ టికెట్ ఆశించి భంగపడినవారికి కూడా పదవులు దక్కాయి.

కార్పొరేషన్లకు చైర్మన్ల లిస్ట్...

ఎండీ రియాజ్: తెలంగాణ స్టేట్ గ్రంధాలయ పరిషద్

పోడెం వీరయ్య: తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్

కాల్వ సుజాత: తెలంగాణ స్టేట్ ఆర్య వైశ్య కార్పోరేషన్

ఆర్ గురునాథ్ రెడ్డి: తెలంగాణ స్టేట్ హౌజింగ్ కార్పోరేషన్

ఎన్ గిరిధర్ రెడ్డి: తెలంగాణ స్టేట్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్

జనక్ ప్రసాద్: తెలంగాణ స్టేట్ మినిమమ్ వేజస్ అడ్వజరీ బోర్డ్

ఎం విజయ బాబు: తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్

చల్లా నరసింహ రెడ్డి: తెలంగాణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కో-ఆపరేషన్ లిమిటెడ్

కె. నరేందర్ రెడ్డి: శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ

ఇ.వెంకట్రామి రెడ్డి: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ

రాంరెడ్డి మల్రెడ్డి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ

M.A. జబ్బార్: తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్

నాయుడు సత్యనారాయణ : తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్

అనిల్ ఎరావత్: తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్

నిర్మల జగ్గారెడ్డి: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కార్పొరేషన్ లిమిటెడ్

ఐతా ప్రకాష్ రెడ్డి: తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్

మన్నె సతీష్ కుమార్ : తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవల అభివృద్ధి కార్పొరేషన్

ఎన్.ప్రీతమ్ : తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్

నూతి శ్రీకాంత్ : తెలంగాణ స్టేట్ బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్

బెల్లయ్య నాయక్ : తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబల్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్

కె.తిరుపతి: తెలంగాణ స్టేట్ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్

జె.జైపాల్ : మోస్ట్ బ్యాక్వార్డ్ క్లాసెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్

పటేల్ రమేశ్ రెడ్డి: తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్

ఎం.ఏ.ఫహీం : తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్

బండ్రు శోభారాణి: తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్

ఎం.వీరయ్య: తెలంగాణ స్టేట్ వికలాంగుల కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్

కె.శివ సేనారెడ్డి: తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్

అలేఖ్య పుంజల: తెలంగాణ సంగీత నాట్య అకాడమీ చైర్మన్

ఎస్. అన్వేష్ రెడ్డి: తెలంగాణ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ చైర్మన్

కాసుల బాల రాజు: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి ఛైర్మన్

జంగా రాఘవరెడ్డి: తెలంగాణ రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిదారుల ఛైర్మన్

మనాల మోహన్: తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్

రాయల నాగేశ్వరావు రావు: తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్

జ్ఞానేశ్వర్ ముదిరాజ్: తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్

మెట్టు సాయి కుమార్: తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘ ఛైర్మన్

మాజీ కేంద్రమంత్రి కోడలికి నామినేటెడ్ పోస్ట్:

దివంగత మాజీ కేంద్రమంత్రి పుంజల శివశంకర్ కోడలిని నామినేటెడ్ పోస్టు వరించింది. డాక్టర్ అలేఖ్య పుంజల ని తెలంగాణ సంగీత నాట్య అకాడమీ చైర్ పర్సన్ గా ప్రభుత్వం నియమించింది. అలేఖ్య కూచిపూడి కళాకారిణి, నాట్య గురువు. తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య బోధకురాలిగా అనేకమందికి నృత్యశిక్షణ ఇచ్చిన అలేఖ్య, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ హోదాని అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. శివశంకర్ కుమారుడు వినయ్‌ కుమార్‌ తో అలేఖ్య వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వినయ్‌ కుమార్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యనిపుణులుగా పనిచేస్తూ, రాజకీయాలలో ఉన్నారు.

Tags:    

Similar News