Assembly | రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు
సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతినిధులు సమాయత్తమయ్యారు.
By : Shaik Saleem
Update: 2024-12-08 16:53 GMT
Telangana Assembly, Council, meetings,tomorrow,తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చడం సర్కారు మూర్ఖత్వమని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సోమవారం నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ అధికారులతో అసెంబ్లీ భద్రతపై సమీక్షించారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో ఆదివారం శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో ముందస్తు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు పాల్లొన్నారు.
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ కోరారు.మూసీ, హైడ్రా, గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలపై సభలో సర్కారును నిలదీయాలని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ఫిబ్రవరిలో బహిరంగసభ ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత అన్ని పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేస్తామని కేసీఆర్ చెప్పారు.
- తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ , మండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీఆర్ తన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భారాసఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన ఏడు అంశాలపై పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. అధిాకర కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రతినిధులు అసెంబ్లీ, మండలి సమావేశాలకు సమాయత్తమయ్యారు.