హైదరాబాద్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.;

Update: 2025-05-18 10:01 GMT

చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాలకు వెంటనే పోస్టు మార్టం చేసి వారి బంధువులకు అందజేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర దిగ్ధ్రాంతి వ్యక్తం చేసిందని భట్టి చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ లు వచ్చారు.ఉస్మానియా హాస్పిటల్ మార్చుూరీలో ఉన్న అగ్ని ప్రమాద మృత దేహాలను మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బాధిత కుటుంబాలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించిన మంత్రి ఆదేశించారు.


స్పీకర్, మండలి ఛైర్మన్ల సంతాపం
హైదరాబాద్​ పాత బస్తీలోని గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందడంపై తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల్లో చిన్న పిల్లలు, మహిళలు ఉండటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
హైదరాబాద్​ పాత బస్తీలోని గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందడంపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ఆయన తెలిపారు . మృతులలో చిన్న పిల్లలు, మహిళలు ఉండటం చాలా బాధాకరమని అన్నారు . గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆయన ప్రార్ధించారు.


Tags:    

Similar News