"దేశంలోనే ఆ ఘనత దక్కిన మొదటి స్టూడెంట్ రోహిత్ వేముల"

రోహిత్ ఎస్సీ కాదని, అతను చదవలేకపోయాడని పోలీసులు రిపోర్ట్ లో పచ్చి అబద్ధాలు రాశారని రోహిత్ వేముల తల్లి ఆరోపించారు.

By :  Vanaja
Update: 2024-05-04 16:41 GMT

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మరోసారి దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ కేసు క్లోజ్ చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నా కొడుకు చావుకి కరణమైనవారిని శిక్షించి, నాకు న్యాయం చేకూర్చండి అంటూ అతని తల్లి మళ్లీ రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇప్పటికే రాధిక వేముల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కేసుని పునర్విచారణ జరిపించాలని కోరారు. తన కొడుకును ఆత్మహత్యకు ప్రేరేపించిన దోషులకి శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేసుని పునర్విచాలని జరిపించి, న్యాయం చేస్తామని సీఎం ఆమెకి హామీ ఇచ్చారు.

కేస్ క్లోజ్ చేయడంపై రోహిత్ తల్లి రాధిక వేముల శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలను తప్పించేందుకే కేస్ క్లోజ్ చేశారని ఆమె ఆరోపించారు. రోహిత్ వేముల కులం గురించి పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ ముమ్మాటికీ ఎస్సీ నే అని ఆమె స్పష్టం చేశారు. రోహిత్ ఎస్సీ కాదని, అతను చదవలేకపోయాడని పోలీసులు రిపోర్ట్ లో పచ్చి అబద్ధాలు రాశారన్నారు. రోహిత్ చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడని, ఎమ్మెస్సీలో స్టేట్ 6th ర్యాంకర్ అని గుర్తు చేశారు. JRF లో రెండు విభాగాల్లో క్వాలిఫై అయిన దేశంలోనే మొదటి స్టూడెంట్ రోహిత్ వేముల అని చెప్పారు. అలాంటి తన బిడ్డ చదవలేక చనిపోయాడని పోలీసులు చెప్పడం దారుణమని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు తన కొడుకుపై చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని రాధిక చెప్పారు. బిజెపి నేతలను తప్పించేందుకే కేసు క్లోజ్ చేస్తున్నారని ఆరోపించారు. అబద్దాలు ప్రచారం చేసేవారు రోహిత్ రాసిన పోయెట్రీలు చదివితే అతనేంటో అర్థం అవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసు రీఓపెన్ చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని తనకి హామీ ఇచ్చారని చెప్పారు. రోహిత్ కేసు క్లోజ్ అయిందని బిజెపి వాళ్లు, ఆర్ఎస్ఎస్ వాళ్లు సంబరాలు జరుపుకున్నారని.. కానీ తాను ఉన్నంతవరకు రోహిత్ వేముల కేసులో న్యాయం జరిగే వరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. రోహిత్ సర్టిఫికెట్లు ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్స్ లాంటివి కాదని రోహిత్ తల్లి రాధిక వేముల విమర్శించారు.

Tags:    

Similar News