బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: రేవంత్

స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్కలు తేలాలి. జనగణనతో పాటు కులగణన చేపట్టి ఆ సమస్యను పరిష్కరించామని రేవంత్ చెప్పారు.;

Update: 2025-04-02 09:04 GMT

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టుబిగించారు. ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ కూడలిలో జరుగుతున్న బీసీ సంఘాల ధర్నాలో కూడా ఆయన పాల్గొన్నారు. బీసీలకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా తాను కానీ, తమ పార్టీ కాని వేనకాడదన్నారు. బీసీలకు ఇన్నాళ్లూ అన్యాయం జరిగిందని, బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన తమ పార్టీనే చేసిందని అన్నారు. అందులో భాగంగానే కులగణన చేపట్టి.. వారికి రిజరవేషన్ల కలపించే మార్గం సుగమం చేశామన్నారు. బీసీల లెక్క తేలకుండా రిజరవేషన్లు కల్పించలేమని కోర్టులు చెప్పాయని, ఇప్పుడు లెక్కలు తేలాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరుగుతున్న బీసీ సంఘాల ధర్నాలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేశామని చెప్పారు.

‘‘దేశ ప్రజలను ఏకం చేయడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. అందులో ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కులగణన చేస్తామని అప్పుడే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇక బీసీ బిల్లుకు ఆలోచన, స్ఫూర్తి అన్నీ రాహుల్ గాంధీనే. రాహుల్ చేపట్టిన జోడో యాత్రలో బలహీన వర్గాలు తమ జనాభా లెక్క గురించి అడిగారు. జనగణనతో పాటు కుల గణన కూడా జరగాలని కాంగ్రెస్ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే కుల గణన చేపట్టాం. బీసీల లెక్కలు తేల్చాం. వారికి రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేశాం’’ అని చెప్పారు.

‘‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతూనే కుల గణన చేస్తామని రాహుల్ ప్రకటించారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తీర్మానం చేసి బీసీ కులగణన చేపట్టాం. ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్‌డేగా నిర్ణయించాం. ఆ రోజునే బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు, ఎస్‌సీ వర్గీకరణ బిల్లుకు కూడా తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకం. మండల కమిషన్‌కు వ్యతిరేకంగా కుట్ర చేసిన పార్టీ బీజేపీ. అందుకే బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు తమ పెద్దలతో ఈ అంశంపై చర్చించాలి. అఖిలపక్ష సమావేశానికి ఏర్పాటు చేయాలి’’ అని రేవంత్ కోరారు.

‘‘బీసీల గొంతు వినిపించడానికే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు చెప్పాయి. స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్కలు తేలాలి. జనగణనతో పాటు కులగణన చేపట్టి ఆ సమస్యను పరిష్కరించాం. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలనేది మా పార్టీ నిర్ణయం. బీసీలను బలపరచాలనే ఆలోచన బీజేపీకి లేదు. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందనే 2021లో జనాభా లెక్కలను వాయిదా వేసింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది’’ అని రేవంత్ విమర్శించారు.

Tags:    

Similar News