NHRC సరోగసి మహిళ ఆత్మహత్యపై ఎన్‌హెచ్ఆర్సీ సీరియస్, సుమోటో విచారణ

సరోగసి కింద బిడ్డను కనేందుకు వచ్చిన మహిళను లైంగికంగా వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మహిళ ఆత్మహత్య ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది.

Update: 2024-11-29 09:47 GMT

హైదరాబాద్ నగర పరిధిలోని రాయదుర్గంలో ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై మీడియాలో వచ్చిన కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.

- ఒడిశాకు చెందిన బాధితురాలైన ఓ మహిళను రూ.10 లక్షల ఒప్పందం ప్రకారం అద్దె గర్భం (SCRROGACY)కోసం మధ్యవర్తుల ద్వారా నగరానికి తీసుకువచ్చారు. ఆమె నగరంలో భర్తకు దూరంగా ప్రత్యేక ఫ్లాట్‌లో ఉంచారు.

మహిళ మానవ హక్కుల ఉల్లంఘన
బాధిత మహిళ మానవ హక్కుల ఉల్లంఘన సమస్యను జాతీయ కమిషన్ గమనించింది.ఒడిశాకు చెందిన 25 ఏళ్ల బాధిత మహిళ ఒక వ్యక్తి లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి భర్త నాలుగేళ్ల కొడుకుతో పాటు సమీపంలోని వేరే వసతి గృహంలో ఉన్నాడు. నవంబరు 26న ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి అక్కడ ఉండడం ఇష్టం లేదని, ఆ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నందున తన జీవితాన్ని ముగించుకుంటానని చెప్పినట్లు సమాచారం. సరోగసి కింద బిడ్డను కనేందుకు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాయదుర్గం వచ్చిన మహిళను లైంగికంగా వేధించడంతో ఆ మహిళ ఆత్మహత్య (woman’s suicide) చేసుకుంది. మహిళ ఆత్మహత్య ఘటనను పత్రికల్లో చూసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు విచారణను సుమోటోగా ఎన్ హెచ్ ఆర్ సీ విచారణకు స్వీకరించింది.(suo motu cognizance).

తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు
సరోగసి కోసం ఒడిశా రాస్ట్రం నుంచి వచ్చిన మహిళ ఆత్మహత్య చేసుకున్న ఉదంతంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ డీజీపీ జితేందర్ లకు జాతీయ మానవహక్కుల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వండి
సరోగసి కోసం వచ్చి లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మహిళ ఘటన గురించి సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా పంపించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ జితేందర్ లను ఆదేశించింది. సరోగసి పేరిట తీసుకువచ్చి మహిళను లైంగికంగా వేధించిన వ్యవహారంపై వివరాలు పంపించాలని ఎన్‌హెచ్ఆర్సీ కోరింది. మహిళ ఆత్మహత్య ఘటన ఎఫ్ఐఆర్, ఫిర్యాదు దారు ఇచ్చిన దరఖాస్తులను కూడా పంపించాలని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశించింది.


Tags:    

Similar News