బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో మంగళవారం సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మద్యం పాలసీ కేసులో కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందజేసింది.
దాదాపు మూడు గంటలు విడుదల ప్రాసెస్...
ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇచ్చిన షూరిటీ బాండ్లను ట్రయల్ కోర్టు స్వీకరించింది. దాదాపు మూడు గంటల పైనే కవిత విడుదల ప్రాసెస్ జరిగింది. అనంతరం ఆమెని అధికారులు రిలీజ్ చేశారు. ఈ ఏడాది మార్చ్ 15 న అరెస్టైన కవిత... 165 రోజుల తర్వాత లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పై బయటకి వచ్చారు. అప్పటికే తీహార్ జైలు వద్దకు చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆమెకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.BRS MLC Kavitha
Kavitha Release
Kavitha Bail
Delhi Liquor Scam
వడ్డీతో సహా చెల్లిస్తా -కవిత
"నేను కేసీఆర్ బిడ్డను. నేను మొండి దాన్ని. అనవసరంగా నన్ను జైలుకు పంపారు. ఐదు నెలలు కుటుంబానికి దూరంగా జైల్లో ఉన్నాను. 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. నన్ను అనవసరంగా జైలుకు పంపి జగమొండి దాన్ని చేశారు. నాకు సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడం సంతోషంగా ఉంది. ఈ కష్ట సమయంలో నాకు నా కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని తెలిపారు కవిత.