తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం కలే: మహేష్ కుమార్

లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో కమలం వికసించిందని, కానీ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అందిన నిధులు మాత్రం గుండు సున్నా అని ఎద్దేవా చేశారు.;

Update: 2025-04-07 10:30 GMT

బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉండి, తెలంగాణ నుంచి పలువురు ఎంపీలు ఉన్నా వాళ్లు తెలంగాణకు తెచ్చిందేమీ లేదన్నారు. తాము చెప్పేది అబద్ధమయితే తెలంగాణ కోసం బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో కమలం వికసించిందని, కానీ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అందిన నిధులు మాత్రం గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే తెలంగాణ బీజేపీ నేతుల చోద్యం చూస్తూ కూర్చున్నారే తప్ప ఏం చేయలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంతగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తోందని అన్నారు.

‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి‌ది అమిత్ షా చెప్పులు తొడిగిన చరిత్ర. 11ఏండ్లు తెలంగాణ కు ఏమి తెచ్చారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. చర్చకు సిద్ధమా? మోడీ ,అమిత్ షాలు ఆర్థర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పని చేస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగి పోతే కిషన్ రెడ్డి ఎందుకు పట్టలేదు. 10వేల భూముల ను కేసీఆర్ , కేటిఆర్ లు అమ్ముకుంటే కిషన్ రెడ్డి ఏమి చేస్తుండు? కిషన్ రెడ్డి ఒక్క చాన్స్ కావాలని ప్రాధేయపడుతుండు. తెలంగాణ కు ఏమి ఎలగబెట్టారని ఒక్క చాన్స్ అని అడుగుతున్నారు’’ అని చురకలంటించారు.

‘‘మూడు సార్లు మోడీని ప్రధానిని చేస్తే రాష్ట్రానికి ఏమి ఎలగబెట్టారు. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డి కి ఎమ్మెల్యేగా,ఎంపీగా ,కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే ఏమి చేశారు. మూడో సారి కూడా మతం పేరున ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చారు. మెట్రో కోసం ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదు. మూసి ప్రక్షాళన జరిగి హైదరాబాద్ ప్రజలు సుకపడటం కిషన్ రెడ్డి కి పడదు. మతతత్వ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు నచ్చదు. అందుకే మీకు ప్రజలు చాన్స్ ఇవ్వరు’’ అని విమర్శలు గుప్పించారు.

‘‘తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం కల. విభజన హామీలు కిషన్ రెడ్డి కి,బండి సంజయ్ కి పట్టదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పగటి కలలు కంటున్నారు. కేంద్ర తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న కూడా పేదల సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ పని చేస్తోంది. సచివాలయంలో కూర్చునే అధికారం అందరికి ఉంది. మీనాక్షి నటరాజన్ మంత్రులతో రివ్యూ చేసింది అనటం అవాస్తవం. నన్ను రివ్యూ కి రావొద్దని అన్నారనేది కరెక్ట్ కాదు. నేను మీనాక్షి పర్మిషన్ తీసుకుని మా సొంత ఊరు పోయాను’’ అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News