Maha Kumbh Mela | కుంభమేళాకు క్యూ కడుతున్న తెలుగు ప్రజలు

కుంభమేళాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిపోతున్నారు. కుంభమేళాకు వెళ్లే తెలుగు భక్తులకు ట్రావెల్ ఏజెంట్లు పలు సూచనలు చేశారు.;

Update: 2025-01-21 14:26 GMT

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నగరంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వతేదీ వరకు జరుగుతున్న మహా కుంభమేళాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు రైళ్లు, ప్రత్యేక బస్సుల్లో పెద్ద సంఖ్యలో వెళుతున్నారు.

- ప్రయాగరాజ్ నగరంలోని సంగమ పవిత్ర నదీ జలాల్లో భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తి పారవశ్యంతో తరలిపోతున్నారు. రైళ్లలో టికెట్లు లభించక, విమానాల చార్జీలు పెరగడంతో భక్తులు ప్రత్యేక బస్సుల్లో వెళుతున్నారు.
- హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ కు విమాన టికెట్ ధర రూ.8వేలు ఉండగా, కుంభమేళా భక్తుల రద్దీతో రూ.12వేల నుంచి రూ.25వేలకు పెరిగింది.
- హైదరాబాద్ జంట నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహిళలు కుంభమేళాకు తరలివచ్చారని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వెల్లడించింది.
- కుంభమేళాకు వెళ్లే టూర్ ప్యాకేజీల వివరాల కోసం భక్తులు ట్రావెల్ ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. కొందరు ప్రైవేటు టూరిస్టు బస్సులను అద్దెకు తీసుకొని ప్రయాగరాజ్ మార్గం పట్టారు.

ఏపీ నుంచి మహా కుంభమేళాకు స్పెషల్ బస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఏపిఎస్ఆర్టీసీ రాజమండ్రి, కొవ్వూరు నుంచి ప్రత్యేక బస్సు సర్వీలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఫిబ్రవరి 1వతేదీన మధ్యాహ్నం 2గంటలకు కొవ్యూరు బస్ కాంప్లెక్స్ లో కుంభమేళాకు బస్సు బయలుదేరుతుందని,ఈ యాత్ర 7 రోజులు పాటు కొనసాగుతుందని ఆర్టీసీ అధికారులు చెప్పారు. టికెట్ ధర రాను, పోను కలిపి ఒక్కరికి రూ.10 వేలుగా ఆర్టీసీ నిర్ణయించింది.

మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ట్రావెల్ ఏజెంట్ల సలహాలు
- మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు నడవడానికి సిద్ధంగా ఉండాలని ట్రావెల్ ఏజెంట్లు సూచించారు. ప్రధాన మేళా ప్రాంతానికి చేరుకోవడానికి సామాన్లతో 4–6 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. భక్తులు రైలులో వస్తే, 10 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది.
- కుంభమేళాలో ఆటోలు, ఇ-రిక్షాలు లేదా ఓలా సేవలు లేవు. కుంభమేళా సమయంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఆటోల సేవలు నగరం లోపల పరిమితం చేశారు.
- వారణాసి వైపు నుంచి రహదారి ద్వారా) వస్తున్నట్లయితేప్రధాన మేళా ప్రాంతం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝుసి వద్ద దిగాలి. కొన్ని ఆటోలు అనధికారికంగా నడుస్తున్నాయని, పోలీసులు ఏ సమయంలోనైనా ఆపవచ్చునని ఏజెంట్లు చెప్పారు.
- ఎవరైనా మిమ్మల్ని సంగం ప్రాంతంలోనే దింపగలమని చెబితే నమ్మవద్దు. మేళా మైదానంలో కనీసం 3నుంచి 4 కిలోమీటర్ల దూరం నడవాలి.
- భక్తుల వసతి కోసం టెంట్లు మాత్రమే ఉన్నాయి: రోజుకు రూ.15 వేలు ప్రారంభ రేటు ఉంది
- భక్తులు కాలినడకన సౌకర్యవంతంగా తీసుకెళ్లగల ముఖ్యమైన వస్తువులను మాత్రమే తీసుకురావాలని సూచించారు.
- రాత్రులు చల్లగా ఉంటాయి కాబట్టి వెచ్చని దుస్తులు ధరించాలి.
- ఎక్కువ దూరం నడవాలి కాబట్టి బూట్లు,సౌకర్యవంతమైన బట్టలు, పాదరక్షలు ధరించండి.
- పెద్ద జన సమూహం, ఎక్కువ నడక దూరం ఉండటం వల్ల చిన్న పిల్లలను కుంభమేళాకు తీసుకురావద్దని ట్రావెల్ ఏజెంట్లు సలహా ఇచ్చారు.
- నాగ సాధువులు, ఇతర వర్గాలు ఉదయం 5:30గంటల నుంచి 7:00 గంటల ప్రాంతంలో రావడం ప్రారంభిస్తారు. వారి తర్వాత ప్రజలు స్నానం చేయవచ్చు. కానీ సాధువులు ముగిసిన తర్వాత జనసమూహం గణనీయంగా పెరుగుతుంది.
- భక్తులు గుంపు నుండి విడిపోతే ప్రకటనల కోసం 10 టవర్లు ఏర్పాటు చేశారు.
- సమూహ గుర్తింపు కోసం ఒకే రంగు టోపీలు, జెండాలు పినియోగిస్తే మేలు.
- కుంభమేళాలో ఆహారం,వివిధ వంటకాలను అందించే ఉచిత ఆహార దుకాణాలు అందుబాటులో ఉన్నాయి.
- కుంభమేళాలో దుప్పట్లు, స్నాక్స్ ధర సాధారణ ధర కంటే రెట్టింపు ఉంటుంది.
- ఎక్కడ స్నానం చేయాలంటే ప్రధాన సంగం వృత్తాకార ప్రాంతంలో ఉంది.ఒక వైపు గంగా, మరోవైపు యమునా ప్రవహిస్తుంది.
- షాహి స్నాన్ రద్దీని నివారించడానికి మీ తేదీలను ప్లాన్ చేసుకోండి.తక్కువ సామాను తీసుకెళ్లండి,ఎక్కువ దూరం నడవడానికి సిద్ధంగా ఉండండి.ట్రావెల్ ఏజెంట్లు అందించిన సలహాలను పాటిస్తే మీ మహా కుంభమేళా యాత్రను మరింత సులభతరం చేసుకోవచ్చు.


Tags:    

Similar News