బీఆర్‌ఎస్ రజతోత్సవ వేళ పూరి బీచ్ లో కేసీఆర్ సైకత శిల్పం
బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందడి ఆదివారం ఉదయం నుంచే మొదలైంది.బండేనక బండి కట్టి బయలెల్లి పోదాం రారో కేసీఆరు సభకు అంటూ ఎడ్లబండిపై బీఆర్ఎస్ సభకు తరలివస్తున్నారు.;
తెలంగాణ రాష్ట్రీయ సమితి ఆవిర్భవించి పాతికేళ్లు అయిన సందర్భంగా భారీ రజతోత్సవ సభను హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలోని ఆదివారం 4 గంటలకు నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవం సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న నేపథ్యంలో అందరి చూపు ఆయన సభపై పడింది.
‘‘బండేనక బండి కట్టి బయలెల్లి పోదాం రారో కేసీఆరు సభకు’’ అంటూ గులాబీ సైనికులు తెలంగాణ నలుమూలల నుంచి ఆదివారం ఉదయాన్నే ఎడ్లబండ్లపై బయలు దేరారు. తెలంగాణలో ఏ జిల్లాలో చూసినా గులాబీ దండు గులాబీ గర్జనకు తరలివెళుతుండటం కనిపించింది. జెండా పట్టి..బండ్లు కట్టి గులాబీ దండు కదిలింది.
బండేనక బండి కట్టి బయలెల్లి పోదాం రారో కేసీఆరు సభకు 🔥🩷#25YearsOfBRS#BRSat25 pic.twitter.com/IvEoJwSoL7
— BRS TechCell (@BRSTechCell) April 26, 2025
- తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ…తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ…తెలంగాణను సాధించిన పార్టీ, పదేళ్లు తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పాటలు పెట్టి ఎల్కతుర్తి సభకు తరలివెళుతున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి ఓరుగల్లుకు జనప్రభంజనం కదిలింది.
25 అంబాసిడర్ కార్లతో ఎల్కతుర్తికి...
💥 కేసీఆర్ సైకత శిల్పాన్ని వేయించిన ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
— BRS Party (@BRSparty) April 26, 2025
💥 బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా కేసీఆర్ సైకత శిల్పం
💥 అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారి మీద అభిమానంతో, ఉమ్మడి… pic.twitter.com/tfzGXXcji8
బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా కేసీఆర్ సైకత శిల్పం