భాగ్యనగరంలో భూముల ధరలూ,అద్దెలకు రెక్కలు

హైదరాబాద్‌లో భూముల ధరలే కాదు ఇంటి అద్దెలు కూడా పెరిగాయని అన్‌రాక్ రీసెర్చ్ డాటా వెల్లడించింది.హైటెక్ సిటీ, గచ్చిబౌలిలలో భూముల ధరలు,అద్దెలు పెరిగాయి.

Update: 2024-09-20 06:24 GMT


Heading

Content Area

హైదరాబాద్‌లో భూముల ధరలు, అద్దె విలువలు పెరిగాయని అన్ రాక్ రీసెర్చ్ రిపోర్టు విశ్లేషించింది.గచ్చిబౌలిలో ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు రూ.5,010 నుంచి రూ.8,500కి పెరిగాయి.
గచ్చిబౌలిలో అద్దెలు కూడా రూ.22,000 నుంచి రూ.33,000కి పెరిగాయి.
- హైదరాబాద్‌ నగరంలో గత మూడేళ్లలో భూముల ధరలు 59 శాతం వరకు పెరిగాయి. అద్దె కంటే భూమి కొనుగోలుకు ప్రాధాన్యత పెరిగింది.
- హైటెక్ సిటీలో భూముల విలువలు 59 శాతం పెరిగాయి. 2021సంవత్సరం నుంచి 2024 వరకు అద్దె విలువలు 46 శాతం పెరిగాయి. గచ్చిబౌలి మరింత గణనీయమైన వృద్ధిని సాధించింది. అద్దె విలువలు 70 శాతం పెరిగాయని అన్ రాక్ రీసెర్చ్ డేటా వెల్లడించింది.

పెరిగిన నెలవారీ అద్దెలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హైటెక్ సిటీ ప్రాంతంలో నెలవారీ అద్దెల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.రియల్ రంగం పురోభివృద్ధి కనిపిస్తోంది.హైదరాబాద్ నగరంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఆరు నెలల్లో 71 శాతం వృద్ధిని సాధించింది.బెంగళూరులోని సర్జాపూర్ రోడ్డు వంటి ప్రాంతంలో అద్దె విలువలు 67 శాతం, భూముల ధరలు 54 శాతం పెరిగాయి. పూణేలోని హింజేవాడి అద్దె విలువలు 52 శాతం పెరిగాయి. అయితే భూముల ధరల విలువలు 31 శాతం మాత్రమే పెరిగాయి.“బెంగళూరు, పూణే, కోల్‌కతా, చెన్నై నగరాల్లో సగటు నివాస అద్దె విలువలు భూముల విలువల కంటే ఎక్కువగా పెరిగినట్లు టాప్ 7 నగరాల్లోని మార్కెట్ల విశ్లేషణలో తేలింది’’అని అన్ రాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్, రీసెర్చ్ హెడ్ డాక్టర్ ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు.

21 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల అమ్మకాలు 21 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. మెరుగైన జీవన పరిస్థితులు నగరంలో ఉండటంతో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి కేంద్రాలుగా ఐటీ కార్యాలయాలు కేంద్రీకృతం కావడంతో ఎక్కువ మంది కొనుగోలుదారులు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారని తేలింది.కొనుగోలుదారులు విశాలమైన ఇళ్లు, విలాసవంతమైన విల్లాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక తెలిపింది.

ఈవీల రాకతో రియల్ బూమ్
విద్యుత్ వాహనాల (ఈవీ)ల రాకతో రియల్ ఎస్టేట్ రంగం అవుటర్ రింగ్ రోడ్డు దాటి విస్తరించింది. నగరానికి నలువైపులా 50 కిలోమీటర్ల వరకు గృహ నిర్మాణాలు సాగే అవకాశాలు ఏర్పడ్డాయి.పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల రాకతో పెట్రోల్ బంకుల అవసరం తగ్గనుంది.హైదరాబాద్ నగరంలో రూ.1525కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు,రూ.3,385 కోట్లతో మెట్రోవాటర్ వర్క్స్, రూ.500కోట్లతో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు, ఓల్డ్ సిటీ మెట్రో పొడిగింపునకు రూ.500 కోట్లు కేటాయించారు. ముచ్చర్ల నాలుగో నగరం, ఏఐ సిటీ, స్కిల్ యూనివర్శిటీల రాకతో హైదరాబాద్ నగర రూపురేఖలు మారనున్నాయి.




Tags:    

Similar News