ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ.. టార్గెట్ అదేనన్న మంత్రి పొన్నం

హుస్నాబాద్‌కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-11 08:57 GMT

హుస్నాబాద్‌కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కాంప్లెక్స్‌తో హుస్నాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ్ మండలం, తంగలపల్లి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశఆలకు భూమి పూజ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా మొదలైన తన రాజకీయ జీవితం ప్రజల ఆశీర్వాదంతో ఇప్పుడు మంత్రి వరకు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం శాయశక్తులు శ్రమిస్తోందని, విద్య, వైద్యం, పర్యాటకం, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పన ఇలా అన్నింటిలో హుస్నాబాద్ మార్క్ చూపిస్తామని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు నాలుగో తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు ఇక్కడే చదువు పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని, జీవో 190 తీసుకొచ్చి నాలుగు గురుకులాలను ఒకే కాంప్లెక్స్‌గా మారుస్తామని చెప్పారు. తద్వారా పిల్లలకు అందే విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వీలవుతుందని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేస్తామని చెప్పారాయన.

పాఠశాలలకు ప్రాధాన్యం

తాను విద్యాశాఖ మంత్రి కాకపోయినా, ఆ పదవి సీఎం రేవంత్ దగ్గరే ఉన్నప్పటికీ అనేక విధాల విద్యా కార్యక్రమాల్లో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్స్ ప్రాజెక్ట్ ఒకటని గుర్తు చేసుకున్నారు. ‘‘రాష్ట్రంలో 25వేల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేశాం. పాఠశాలలకు ఉచిత విద్యుత్, తాగునీరు, శానిటేషన్ సిబ్బందికి జీతాల విషక్ష్ంలో కూడా చొరవ తీసుకుంటాం. దశాబ్దాలు ప్రమోషన్ కోసం పడిగాపులు కాస్తున్న వారికి గుడ్ న్యూసై్. తెలంగాణ సర్కార్ 19 వేల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో పాటుగా 35 వేల బదిలీలు, డీఎస్సీ ద్వారా మరో 10వేల మందికి నియామక పత్రాలు అందించడం జరిగింది’’ అని వివరించారు మంత్రి పొన్నం.

ఒక్కో పాఠశాలకు రూ.180 కోట్లు

‘‘రాష్ట్రంలో ఇంటిగేట్రెడ్ పాఠశాలల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5వేల కోట్లు వెచ్చించనుంది. దీని ప్రకారం ఒక్కో పాఠశాల నిర్మాణ నిర్వహణల కోసం రూ.180 కోట్లు అందించనుంది ప్రభుత్వం. గురుకులాల్లో ఉన్న అన్ని బకాయిలను కూడా అతి త్వరలో చెల్లించనున్నాం. ముందుగా మెస్ బకాయిలు, ఆ తర్వాత అద్దె అకాయిలు ఇస్తాం’’అని ఆయన వెల్లడించారు. ఈ పాఠశాలలను వచ్చే విద్యాసంవత్సరానికి పూర్తి చేస్తామని చదవుకునేలా విద్యార్థులను ప్రోత్సహించే వాతావరణాన్ని కూడా కల్పించనున్నట్లు చెప్పారు పొన్నం ప్రభాకర్.

Tags:    

Similar News