హైడ్రా బాధితులకు ఈటెల అభయం.. సర్కార్‌పై మాటల ఈటెలు..

హైడ్రా యాక్షన్ ప్లాన్‌తో మూసీ నిర్వాసితులు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ను శరణు కోరారు. ఈ నేేపథ్యంలో సర్కార్‌పై ఈటెల మాటల తూటాలు పేల్చారు.

Update: 2024-09-27 06:59 GMT

మూసీ పరివాహక ప్రాంతంలో నిర్వాసితుల ఇళ్లను కూల్చడానికి తీసుకుంటున్న చర్యలపై మల్కాజ్‌గిరి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. పేదోళ్లను బాధించిన ఏ ప్రభుత్వం బాగుపడింది లేదంటూ రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడిక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. తాజాగా మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా నది పరివాహక ప్రాంతంలో కూడా హైడ్రా చర్యలకు సిద్ధమవుతోంది. దీంతో మూసీ నిర్వాసితులంతా గొగ్గోలుపెడుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ ఇళ్లను కూలగొట్టి తమకు అన్యాయం చేయొద్దని వారు కోరుతున్నారు. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా మూసీ పరివాహక ప్రాంతం కొత్తపేట, చైతన్యపురిలోని దాదాపు 200 పైగా కుటుంబాలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక బాధిత కుటుంబాలు తమ గోడు చెప్పుకోవడం కోసం శామీర్ పేటలోని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఆయనకు తమ బాధలను వెలిబుచ్చుకున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వారి బాధలు విన్న ఈటెల రాజేందర్.. వారికి భరోసా కల్పించారు. వారికి తాను అండగా ఉంటానని అభయమిచ్చారు. ఈ క్రమంలోనే నోటీసులు ఇచ్చిన ప్రాంతాలను తానే స్వయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈరోజు ఆయన ఓల్డ్ అల్వాల్‌కు బయలుదేరారు.

భయమొద్దు.. నేను అండగా ఉంటా..

‘‘పేదల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం బాగుపడినట్లు చరిత్రలో లేదు. సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు. చరిత్రలో పేదలతో పెట్టుకున్నవార, పేదల కన్నీటికి కారకులైన వారికి మంచి జరిగిన దాఖలాలు లేవు. పోయేకాలం వచ్చిన సమయంలోనే పేదల జోలికి వెళ్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితితి వచ్చినట్లుంది. అందుకే పేదల గూడు తొలగిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. బాధితులు ఎవరూ కడా కోర్టులకు కూడా వెళ్లకూడదన్న ఉద్దేవంతోనే కూల్చివేతలను శని, ఆదివారాలు జరపడం దారుణం. నిజాం సర్కార్ కంటే అత్యంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. హైదరాబాద్‌లోని పేదలు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తుందట.. ఈ ప్రభుత్వం. వీరి తీరు బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అని అన్నట్లుంది. ఎన్నికల సమయంలో ఈ మేక వన్నె పులులు.. ఓట్ల కోసం నోటికొచచిన మాటలు చెప్పారు. ముసలి కన్నీరు కార్చి పేదలను మోసంం చేశారు. మూసీ బాధితులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు.. మూసీ నిర్వాసితుల పక్షాన ఉంటాను’’ అని ఆయన అభయమిచ్చారు.

కూల్చివేతలు అప్పటి వరకు ఆపాలి..

మూసీ బాధితులను కలిసిన అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పుడప్పుడే కూల్చివేతలు చేపట్టొద్దని కోరారు. బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతనే అక్కడ కూల్చివేతలకు ఉపక్రమించాలని అన్నారు. ‘‘ఇప్పటికప్పుడు వెళ్లిపోవాలంటే మూసీ నిర్వాసితులు ఎక్కడికి వెళతారు. మూసీ ప్రాంతంలో నివసించే వారు పేదవాడే అయి ఉంటాడు. అలాంటి వాడికి రెండు మూడు ఇళ్లు ఉండవు. ఆ వాసనకు, దోమలుకు, ఈగలకు, పిల్లల రోగాలకు జీవచ్చవాళ్లా బతికేవాళ్లే మూసీ పక్కన ఉంటున్నారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు. వారికి ప్రత్యామ్నాయం చూపే వరకు వారి జోలికి వెళ్లొద్దు. వారికి పునరావాసం కల్పించిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలి’’ అని చెప్పారు ఈటెల రాజేందర్.

అధికారం ఐదేళ్లకే..

‘‘హైదరాబాద్‌లో రెక్కల కష్టాన్ని నమ్మకుని బతుకుతున్న పేదల జీవితాలను ఛిత్రం చేసేలా వ్యవహరిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ఎన్నో హమీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయలేదు. మళ్ళీ వాటి ఊసు కూడా ఎత్తడం లేదు. ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారి నడ్డే విరుస్తోంది. ఒక తరం కష్టపడి కట్టుకున్న పేదల ఇళ్లను నిట్టనిలువునా కూల్చేస్తోంది. ఆనాటి రేవంత్ రెడ్డి మాటలు మల్లొకసారి సెల్ఫోన్లో చూడండి, ఇప్పుడు చేస్తున్న దుర్మార్గపు పనులను చూడండి. మీరు మేక వన్నె పులులు. ఆనాడు మన ముందుకు వచ్చి దండం పెట్టుకుంటూ ముసలి కన్నీరు కార్చారు. పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నారు. ఓటు వేసిన పాపానికి, అధికారం ఇచ్చిన కర్మానికి ఎంతమంది పేదల ఉసురు పోసుకుంటున్నారు. పేదల కన్నీళ్ళలో కొట్టుకుపోతారు. ప్రజలు మీకు అధికారం ఐదేళ్లకే ఇచ్చారు.. 50ఏళ్లకు కాదు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని హెచ్చరించారు మల్కాజ్‌గిరి ఎంపీ.

పేదలకు బీజేపీ అండ

‘‘హైడ్రా దుడుకు చర్యల సమయంలో పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. రూ.50 లక్షల ఖర్చుతో షెడ్డు వేసుకున్నానని, ఒక్క మూడు గంటల సమయం ఇస్తే సామాను తీసుకుపోతామన్న అధికారులు అవకాశం ఇవ్వలేదు. అదే విధంగా గగన్ పహాడ్ దగ్గర మచి నీళ్ల ప్యాకెట్లు అమ్ముకునే ఓ మహిళ తన కొడుకు క్యాన్సర్ ఉందని.. తనకు ఉపాధి అందిస్తున్న ఆ మిషన్ తీసుకునే వరకు సమయం ఇవ్వాలన్నా అంగీకరించకుండా.. బుల్డోజర్లు ఎక్కించి వాటిని తొక్కించి బద్దశత్రువు కన్నా దారణంగా వ్యవహరించారు హైడ్రా అధికారులు. రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టింది పేదల ఇళ్ళు కూల్చడానికి కాదు. పేదల కళ్ళలో మట్టి కొట్టడానికి కాదు. పేదల బ్రతుకులు ఛిద్రం చేయడానికి కాదు. దౌర్జన్యం చేయడానికి కాదు. ఇంకా చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేసి పెట్టండి’’ అని సూచించారు.

ఆరు నెలలుగా జీతాలు నిల్

‘‘దవాఖాణాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇచ్చే దమ్ము కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఊళ్ళలో సర్పంచులు పనులు చేసి ఉన్నారు.. మూడేళ్లుగా డబ్బులు లేవు 60 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతకు ముందు ఇదే రేవంత్ రెడ్డి సర్పంచ్లారా తిరగబడండి రోడ్ల మీదకి రండి అని రెచ్చగొట్టారు. పనిచేసిన వాళ్లకి ఇవ్వటానికి పైసలు లేవు కానీ.. మూసినది లక్ష కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తా అంటే.. బట్టల్లేవు గాని బంగారం కొనిస్తా అన్నట్టుంది రేవంత్ రెడ్డి వ్యవహారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన ఉసురు పోసుకోవడానికి వచ్చినట్టు కనిపిస్తుంది. పార్టీ పరంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడతాము. మీరు ఆందోళన పడవద్దు అని కోరుతున్నాను. పోయేకాలం వచ్చింది కాబట్టి పెదలతో పెట్టుకున్నారు. జొన్న బండలో 50 ఏళ్ల క్రితం వచ్చి ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి నోటీసులు ఇస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News