Encounter|ఏటూరు నాగారం అడవుల్లో ఎన్‌కౌంటర్, ఏడుగురి మావోయిస్టుల మృతి
ఏటూరు నాగారంలోని చల్పాక అడవుల్లో ఆదివారం ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు,గ్రేహౌండ్స్ పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.;
పచ్చని చెట్లు, దట్టమైన అడవులతో అలరారుతున్న ఏటూరు నాగారం అడవులు ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ (Encounter)తో రక్తసిక్తమైంది. ప్రశాంతమైన అటవీ గ్రామాల్లో భారీ ఎన్‌కౌంటర్ ఘటనతో ప్రశాంతత చెదిరింది.
- ఆదివారం తెల్లవారుజామున ఏటూరునాగారం (forests of Eturu Nagaram)మండలం చెల్పాక అడవుల్లో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ సాయుధ పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. (seven Maoists killed)
- ఈ కాల్పుల్లో నర్సంపేట ఏరియా కార్యదర్శి బద్రు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంలో రెండు ఏకే -47 రైఫిల్స్, పేలుడు పదార్థాలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు.
-మావోయిస్టుల కదిలికల నేపథ్యంలో అటవీ గ్రామాల్లో వాహనాల తనిఖీలు చేయడంతోపాటు మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ బలగాలను పోలీసులు రంగంలోకి దించారు.మృతుల్లో ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు(43),ముస్సకి జమున(23), జైసింగ్ (25),కిశోర్ (22),కామేష్ (23), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22) ఉన్నారు.