అత్యాచారం కేసులో డాన్స్ మాస్టర్ జానీకి రిమాండ్

తన అసిస్టెంట్ కొరియోగ్రాఫరుగా పనిచేస్తున్న యువతిపై అత్యాచారం కేసులో డాన్స్ మాస్టర్ జానీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉప్పర్ పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-09-20 09:13 GMT

అత్యాచారం కేసులో నిందితుడైన డాన్స్ మాస్టర్ జానీని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. తన అసిస్టెంట్ అయిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో అతనిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.


గోల్కొండ ఆసుపత్రిలో జానీకి వైద్య పరీక్షలు
అత్యాచారం కేసులో నిందితుడైన జానీ మాస్టరు పరారీలో ఉండగా హైదరాబాద్ పోలీసులు గోవాలో గురువారం అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు.జానీ మాస్టరు బెంగళూరు మీదుగా గోవా పారిపోయి అక్కడ దాక్కోగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రి లో జానీ కి వైద్య పరీక్షలు చేయించి, అతన్ని కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల పాటు రిమాండుకు తరలిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని జానీని హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

పోలీసు కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
జానీ మాస్టరును ప్రశ్నించేందుకు పోలీసులకు సమయం లేక పోవడంతో అతన్ని ముందు కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం ఈ కేసులో ప్రశ్నించేందుకు వీలుగా కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. జానీ మాస్టర్‌పై ఈ నెల 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు చేశారు. 15వతేదీనే నార్సింగ్‌ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.


Tags:    

Similar News