విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ఘటన కాంగ్రెస్‌దే: హరీష్ రావ్

తెలంగాణలో లక్షల మంది విద్యార్థుల జీవితాలను అగమ్య గోచారంగా చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీస్ రావు విమర్శలు గుప్పించారు.

Update: 2024-10-08 12:24 GMT

తెలంగాణలో లక్షల మంది విద్యార్థుల జీవితాలను అగమ్య గోచారంగా చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీస్ రావు విమర్శలు గుప్పించారు. కన్వీనర్ కోటాలో ఎంపీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఈ సందర్భంగానే మూడు లక్షల పైగా ర్యాంకులు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ విద్యార్థులు జీవితాలతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటుందని, ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ఎంతో మంది చదువులు ఆపేయడానికి కారణమైందంటూ విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, సుమారు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్య గోచరంగా మార్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఘనత కేసీఆర్, బీఆర్ఎస్‌దే..

తెలంగాణను వైద్య విద్యకు కేరాఫ్‌గా మార్చిన ఘనత మాత్రం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వాలకే దక్కుతుందని హరీష్ రావు చెప్పారు. ‘‘కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 34కు చేరింది. ప్రభుత్వ, ప్రవేటు కాలేజీలు అన్నీ కలిపి తెలంగాణలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 20 నుంచి 60కి పెంచడం జరిగింది. దీని వల్ల తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,850 నుంచి 8,315కు పెరిగింది. తద్వారా ఎంబీబీఎస్ చదవాలని అనుకునే విద్యార్థులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయి. వైద్య విద్య కోసం పక్క దేశాలకు వెల్లాల్సిన అవసరం తప్పింది’’ అని చెప్పుకొచ్చారు.

అందరికీ ఆందోళనే

కాంగ్రెస్ పార్టీ ఫీజు రియింబర్స్‌మెంట్ చేయకపోవడంతో లక్షల మంది విద్యార్థులు దిక్కతోచని స్థితిలో పడిపోయారని, ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థలు టీసీ, ఇతర సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని చెప్పారు హరీష్ రావు. దాంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారని, మానసికంగా కూడా కుంగిపోతున్నారని చెప్పుకొచ్చారాయన. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు’’ అని అన్నారు.

9 ఏళ్లలో 19 వేల కోట్ల విడుదల

‘‘తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 19 వేల కోట్లను ఫీజు రియంబర్స్మెంట్ కోసం విడుదల చేయడం జరిగింది. ప్రతి ఏడాది సగటున క్రమం తప్పకుండా రెండు వేల కోట్లు విడుదల చేసింది. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికి కేవలం విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్య పట్ల తమకున్న ప్రాధాన్యాన్ని చాటి చెప్తోంది’’ అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News