MLC Teenmar Mallanna | తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వివాదం రేపాయి.ఇటీవల రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించారని మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి నేతలు ఫిర్యాదు చేశారు.;

Update: 2025-02-04 15:27 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు.ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ బహిరంగ సభలో రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రెడ్డి సంఘాల నేతలు హెచ్చరించారు.


షోకాజ్ నోటీసు ఇస్తారా?
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలకు ఉప క్రమించే పరిస్థితి ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రేపో మాపో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయించిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మల్లన్నపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారని సమాచారం.ఇటీవల మల్లన్న బీసీ కుల గణన, పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి చిట్ చాట్
‘‘గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు...వ్యక్తులు కాదు..తీన్మార్ మల్లన్న బీ ఫాం నాకే ఇచ్చారు.. పెద్ద ర్యాలీ చేశాం..మినిస్టర్ గా ఉండి ఎమ్మెల్సీ ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా’’అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.మల్లన్న విమర్శలను అయన విజ్ఞతికే వదిలేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ బీ ఫాం మీద గెలిచిన తీన్మార్ మల్లన్న తనపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ‘‘మల్లన్న నన్ను తిడితే వెల్కమ్ చేస్తా..కానీ ఒక కులాన్ని తిట్టడం కరెక్ట్ కాదు.బీసీ మీటింగ్ పెట్టి ఇతర కులాల ను తిట్టడం వల్ల ప్రజల మధ్య మనస్పర్థలు వస్తాయ్.బీసీ ల కోసం కాంగ్రెస్ గొప్ప నిర్ణయం తీసుకుంది’’అని కోమటిరెడ్డి చెప్పారు.



Tags:    

Similar News