‘గేమ్ ఛేంజర్‌గా మారనున్న తెలంగాణ’
దావోస్‌లో తెలంగాణకు భారీ పెట్టుబులు రావడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.;
దావోస్‌లో తెలంగాణకు భారీ పెట్టుబులు రావడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గేమ్ ఛేంజర్‌గా మారుతుందన్నారు. దావోస్‌లో భారీ పెట్టుబడులు రాబట్టి.. బడా బడా సంస్థలను రాష్ట్రానికి తీసుకొస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖచిత్రమే మారిపోయిందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే.. కాంగ్రెస్ మాత్రం అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతుందన్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పెట్టుబడులకు కేరాఫ్‌గా మారిందన్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, గతంలో పెట్టబడి పెట్టిన కంపెనీలు పనులు కూడా ప్రారంభించాయని అన్నారు.
‘‘దావోస్ పర్యటన తెలంగాణ కు ఒక ధమాకాగా నిలిచింది. రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. విదేశీ పెట్టుబడులతో రాష్ట్రం లో 50 నుండి 70 వేల ఉద్యోగాలు అదనంగా రానున్నాయి. మొదటి ఏడాది రూ.42 వేల కోట్లు వచ్చాయి. విదేశీ పెట్టుబడుదారులకు ఫలితాలు వస్తాయని నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి సంక్షేమాలకు మారుపేరు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఫార్మ్ హౌజ్‌కే పరిమితం అయ్యారు కేసీఆర్. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో విదేశీ పెట్టుబడుల సంఖ్య రూ.25,750 కోట్లు మాత్రమే’’ అని గుర్తు చేశారు.
చర్చకు రెడీ..
‘‘గత 5 ఏండ్ల విదేశీ పెట్టుబడుల పై బీఆర్ఎస్ నాయకులతో చర్చకు రెడీ. దావోస్ తెలంగాణ పెవిలియన్ వద్ద పెట్టుబడుల కోసం బారులు తీరుతున్నారు. ఐటీ ఎనర్జి, సోలార్ ,స్పెస్ విభాగంలో పెట్టుబడులు వస్తున్నాయి. కేసీఆర్ చేసిన పాపానికి రాష్ట్రం నెలనెలా రూ.6500 కోట్ల వడ్డీ నెలనెలా కడుతోంది. పది ఏళ్ల పాలనలో కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పు చేసి పామ్ హౌస్‌కు పరిమితం అయిండు. పదేళ్లు ఐటీ మంత్రిగా ఉండి రాష్ట్రానికి కేటీఆర్ ఎంత పెట్టుబడులు తెచ్చారు. కేవలం రూ.25,750 కోట్లు మాత్రమే. 2017 నుండి 2019 వరకు రాష్ట్రానికి పెట్టుబడులు సున్నా’’ అని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌లకు సవాల్
‘‘పది ఏండ్లలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఎంత? ఏడాది లో కాంగ్రెస్ తెచ్చిన పెట్టుబడులు ఎంత? చర్చకు సిద్ధమా కేసీఆర్, కేటీఆర్? రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం దావోస్ పర్యటన ధమాకాగా నిలిచింది. రాష్ట్రానికి రూ.1,78,958 కోట్ల పెట్టుబడులు రావడం శుభ సూచకం. అదనంగా 50 నుండి 70వేల ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దావోస్ పెవిలియన్ దగ్గర కంపెనీలు క్యూ కట్టాయి. గత ఏడాది రూ.41వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంత పెట్టుబడులు రావడానికి విదేశి సంస్థలకు కాంగెస్ ప్రభుత్వం పై ఉన్న నమ్మకమే కారణం’’ అని అన్నారు.
‘‘అన్ని హంగులతో హైదరాబాద్ లో 4th సిటీ ,మెట్రో, ఆర్ఆర్ఆర్ రావడం. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి. తెలంగాణ లి-రియల్ ఎస్టేట్ కూడా పెరిగే అవకాశం ఉంది. కళ్లు ఉండి చూడలేని ప్రతిపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ మాన్‌గా తెలంగాణకు స్పోర్ట్స్ యూనివర్సిటీ తెచ్చారు. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు’’ అని తెలిపారు.