‘మాదిగలకు నమ్మక ద్రోహం’.. సీఎంకు మందకృష్ణ వార్నింగ్

తెలంగాణలోని మాదిగలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీవ్ర అన్యాయం చేసిందని, నమ్మకద్రోహం చేసిందంటూ మందకృష్ణ మాది ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-10-08 11:59 GMT

తెలంగాణలోని మాదిగలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీవ్ర అన్యాయం చేసిందని, నమ్మకద్రోహం చేసిందంటూ మందకృష్ణ మాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారాయన. మాదిగలపైన ప్రేమ సీఎం రేవంత్ మాటల్లోనే తప్ప చేతల్లో రవ్వంతైనా లేదని ఆయన మండిపడ్డారు. మాదిగలను నట్టేట ముంచడమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ చేష్టలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాలల పక్షాన నిలుస్తూ మాదిగలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగకుండానే ఉద్యోగాల భర్తీని సీఎం ఎలా వేగవంతం చేస్తారు? అని కూడా మందకృష్ణ ప్రశ్నించారు. మాదిగల పట్ల సీఎం తీరు ఏమాత్రం సబబుగా లేదని, అందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీసుల వరకు ర్యాలీలు నిర్వహించి నిరసన, ఆందోళన వ్యక్తం చేయాలని, కలెక్టర్లకు మాదిగల కష్టాలను తెలియజేస్తూ వినతి పత్రాలను అందించాలని పిలుపునిచ్చారు మందకృష్ణ. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బషీర్ బాగ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అన్ని విషయాల్లో మాదిగలను తొక్కేసేలానే సీఎం చేష్టలు ఉన్నాయిన, అందుకు పీసీసీ చీఫ్ ఎన్నికల ఉదాహరణ అని చెప్పారు. పీసీసీ ఎన్నికల్లో మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చి మాలలకు అధిక సీట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదిగలకు కేవలం 4 సీట్లు తగ్గించారని, అందుకు సీఎం రేవంత్ రెడ్డే కారణమని విమర్శించారు.

చెప్పిందేంటి చేస్తుందేంటీ..

‘‘వివేక్, వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారు. పార్టీ మారి వచ్చిన వివేక్ కుటుంబంలో రెండు సీట్లు ఇచ్చారు. వాళ్లతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు కాబట్టే ఇలా జరిగింది. కడియం శ్రీహరిని కూడా పార్టీలోకి తానే ఆహ్వానించానని రేవంత్ చెప్పారు. అదే విధంగా సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్‌కు టికెట్ రాకుండా అడ్డున్నది కూడా రేవంత్ రెడ్డే. ఎస్సీ వర్గాకరణను దేశంలోనే అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలబెడతామని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ అప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి రెండు నెలలు కాకముందే మాదిగలకు వెన్నుపోటు పొడిచారు సీఎం రేవంత్ రెడ్డి’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు మందకృష్ణ. ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఎటువంటి ఉద్యోగాల భర్తీ జరగకూడదని మందకృష్ణ కోరారు.

రేవంత్‌కు ఆ గతి తప్పదు

ఎస్సీ వర్గీకరణ లేకుండా ఈ నెల 11న ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నారని గుర్తు చేశారు. ఇలానే చేస్తే రేవంత్ రెడ్డి.. మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్బంగానే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు అన్ని సమావేశమై భవిస్యత్ కార్యాచారణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇదేంటని అడిగిన కొందరు ఎమ్మెల్యేలతో మాల సామాజిక వర్గానికి చెందని ఖర్గు, కొప్పుల రాజు ఆగ్రహానికి గురై పదవి పోగోట్టుకోవాలా? అని రేవంత్ అన్నారని, అవసరమైతే అతి త్వరలోనే ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా బయట పెడతానని మందకృష్ణ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఉద్యగాల విషయంలో ముందుకు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News