Arjuna Award | దీప్తి జివాంజీకి సీఎం రేవంత్ శుభాకాంక్షలు

కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఇద్దరు తెలుగు వారు ఉన్నారు.;

Update: 2025-01-02 12:19 GMT

కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. నలుగురు భారత క్రీడాకారులకు అత్యున్నత క్రీడా పుస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, 32 అర్జున అవార్డులు, 5 ద్రోణాచార్య అవార్డులను వెల్లడించింది. వీటిలో అర్జున అవార్డులు అందుకున్న వారిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉన్నారు. అర్జున అవార్డులు అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఉన్నారు. వీరిలో విఖకు చెందిన రన్నర్ జ్యోతి యర్రాజీ, వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి ఉన్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన జీవాంజి దీప్తి‌కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేష్ గారికి రూ.10 లక్షల నగదు బహుమతిని గతంలోనే అందజేశారు. అదే సమయంలో దీప్తి గారికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వరం‌గల్‌లో 500 గజాల స్థలం కేటాయించాని నిర్ణయించారు. తెలంగాణ యువ క్రీడాకారులు మరింతగా రాణించాలని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మితం కానున్న స్పోర్ట్స్ కాంప్లెక్సులు అందుకు దోహదపడతాయని రేవంత్ తెలిపారు.

అలాగే, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేష్(చెస్), హర్మన్‌ప్రీత్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (ప్యారా అథ్లెటిక్స్), మనుబకర్ (షూటింగ్) లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. 2024 లో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News