గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంపై సీఎం,పీఎం దిగ్భ్రాంతి
హైదరాబాద్ గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్రమోదీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.;
హైదరాబాద్ ఓల్డ్ సిటీ మీర్ చౌక్ లోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో సీఎం మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి,, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.స్థానిక కుటుంబాలతో కూడా ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులను కాపాడుతామని భరోసా ఇచ్చారు.దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని ఆదేశించారు.స్థానిక కుటుంబాలతో ఫోన్ లో సీఎం పరామర్శించారు.