టీ క‌న్స‌ల్ట్ టెలీ క‌న్స‌ల్టేష‌న్ పై కార్లోస్ స్లిమ్ ఆస‌క్తి

ప్ర‌పంచంలోనే ధ‌న‌వంతుల జాబితాలో పేరున్న కార్లోస్ స్లిమ్ తో టీ క‌న్సల్ట్ చైర్మ‌న్ సందీప్ కుమార్ భేటీ అయ్యారు.ఈ సంద‌ర్భంగా టీ క‌న్స‌ల్ట్ లోగోను ఆవిష్క‌రించారు.

Update: 2024-09-25 14:05 GMT

ప్ర‌పంచంలోనే అత్యున్నత ధ‌న‌వంతుల జాబితాలో పేరు క‌లిగిన కార్లోస్ స్లిమ్ హెలూతో టీ క‌న్సల్ట్ చైర్మ‌న్ సందీప్ కుమార్ మ‌ఖ్త‌ల భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా టీ క‌న్స‌ల్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ లోగోను కార్లోస్ స్లిమ్ హెలూ ఆవిష్కరించారు.కార్లోస్ ఏఐ ఆధారిత టెలీ క‌న్స‌ల్టేష‌న్ ప్లాట్‌ఫాంపై ఆస‌క్తి క‌న‌బర్చారు.

- గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ల పూల్ ఏర్పాటు చేస్తున్న టీ క‌న్స‌ల్ట్ చొర‌వ‌ను కార్లోస్ స్లిమ్ హెలూ ప్ర‌శంసించారు.మెక్సికోలో జ‌రిగిన ఈ స‌మావేశంలో టీ క‌న్స‌ల్ట్ ఆవిష్క‌ర‌ణ‌ల ప‌ట్ల కార్లోస్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌ర్చారు.

టెలీ క‌మ్యూనికేష‌న్ రంగంలో సుప్ర‌సిద్ధుడు అయిన కార్లోస్ స్లిమ్ కు అంత‌ర్జాతీయ స్థాయిలో వ్యాపార రంగంలో విశేష ప్ర‌తిభ‌ ఉంది. దేశీయ వ్యాపారాల‌ను అంతర్జాతీయ స్థాయికి విస్త‌రించ‌డం, ఈ ప్ర‌క్రియ‌లో కావాల‌సిన మ‌ద్ద‌తు అందించ‌డం, విదేశీ పెట్టుబ‌డులు ఆకర్షించ‌డం వంటి విష‌యాల్లో టీ క‌న్స‌ల్ట్ కు పేరుంది. టీ క‌న్స‌ల్ట్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ పూల్ ను సైతం ఏర్పాటు చేసింది. టీ క‌న్స‌ల్ట్ ద్వారా ప్రారంభ‌మైన ఈ ఆవిష్క‌ర‌ణ‌ల ప‌ట్ల‌ కార్లోస్ విశేష ఉత్సాహాన్ని క‌న‌బ‌ర్చారు. ఈ సంద‌ర్భంగా కార్లోస్ స్లిమ్‌ను సందీప్ మ‌ఖ్త‌ల సంప్ర‌దాయ భార‌తీయ శాలువాతో స‌న్మానించారు.
“టీ క‌న్స‌ల్ట్‌కు ఈ స‌మావేశం ఎంతో ముఖ్య‌మైన‌ది. టీ క‌న్స‌ల్ట్ యొక్క ఏఐ ఆధారిత టెలీ క‌న్స‌ల్టేష‌న్ ప్లాట్‌ఫాం ప‌ట్ల కార్లోస్ స్లిమ్ ఆస‌క్తి చూపించారు. టీ క‌న్స‌ల్ట్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ పూల్ ద్వారా పెట్టుబ‌డుల‌ను భార‌త‌దేశానికి ర‌ప్పించ‌డంపై దృష్టి పెట్టాం. అంత‌ర్జాతీయ వ్యాపారాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డం మ‌రియు చేరువ చేయ‌డంపై కృషి చేస్తున్నాం”అని సందీప్ మ‌ఖ్త‌ల చెప్పారు.


Tags:    

Similar News