‘నేను తప్పేమీ అనలేదు’.. కేటీఆర్ లీగల్ నోటీసులకు బండి రిప్లై

కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులకు బండి సంజయ్ ఘాటుగా సమాధానమిచ్చారు. కేటీఆర్‌కు 15 అంశాలతో ఎదురు నోటీసులు పంపారు బండి. ఇంతకీ బండి సంజయ్ ఏమన్నారంటే..

Update: 2024-10-29 07:27 GMT

‘కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కూడా చేయించాడు’ అంటూ బండి సంజయ్ చేసిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. బండి సంజయ్ తన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. అయినా బండి సంజయ్ క్షమాపణలు చెప్పకపోవడంతో.. ఆయనపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ పంపిన నోటీసులకు మంగళవారం అంటే అక్టోబర్ 29న బండి సంజయ్ ఘాటు రిప్లై ఇచ్చారు. తాను చేసిన ఆరోపణల్లో ఏమాత్రం అవాస్తవాలు లేవని బండి సంజయ్ తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తాను అబద్ధాలు చెప్పి ఉంటే నిరూపించాలని అన్నారు. అయినా రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసులు పంపడం ఏంటని, కేటీఆర్ తీరును తప్పుబట్టారు. లీగల్ నోటీ అంటే బెదిరిస్తే తాను భయపడే వ్యక్తిని కాదని, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడమంటూ వ్యాఖ్యానిచంారు. కాగా తనపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలని, దాంతో పాటుగా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ నోటీసుల్లో ఏముందంటే..

‘‘అక్టోబర్ 19న బండిసంజయ్ నాపై తీవ్ర ఆరోపణలు చేశారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయించానని, దాని నుంచి తప్పించుకోవడానికి సీఎం రేవంత్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నానని బండి సంజయ్ అనేక వ్యాఖ్యలు చేశారు. వాటిని బండి సంజయ్ నిరూపించాలి. కేవలం నన్న అప్రతిష్టపాలు చేయాలన్న ఉద్దేశంతోనే బండి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే ఇలాంటి నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ తన తప్పు తెలుసుకుని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని కేటీఆర్ తన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే కేటీఆర్ హెచ్చరికలపై స్పందించిన కేటీఆర్.. ఘాటుగా సమాధానమిచ్చారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని బండి వ్యాఖ్యానించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే కేటీఆర్.. లీగల్ నోటీసుల చాటున దాక్కుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు బండి. తొలుత తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించిన కారణంగానే తాను కూడా కేటీఆర్‌పై మాట్లాడానని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాను చట్టాన్ని, న్యాయాన్ని, న్యాయవ్యవస్థను గౌరవించే వ్యక్తినని, లీగల్ నోటీసులకు తాను కూడా నోటీసులతోనే బదులిస్తానని అన్నారు.

అసలేంటి కారణం..

ఈ ఆరోపణల యుద్ధం గ్రూప్-1 పరీక్ష ఆందోళన దగ్గర మొదలైంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న నిరసనలో బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. అప్పుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్‌పై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి.. బండిసంజయ్‌ని పిలిచారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బండి సంజయ్‌ని ఉద్దేశించి పలు ఆరోపణలు చేశారు. ‘చదువులేని బండి సంజయ్‌ని గ్రూప్-1 పై చర్చలకు పిలిస్తే ఏం లాభం. రేవంత్, బండి కలిసి డ్రామాలు చేస్తున్నారు’ అంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన బండి సంజయ్.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న తీరులో కేటీఆర్‌ డ్రగ్స్ తీసుకుంటారని, ఫోన్ ట్యాపింగ్ కూడా చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అది కాస్తా ఇప్పుడు లీగల్ నోటీసుల వరకు వెళ్లింది. ఇదిలా ఉంటే కేటీఆర్ నోటీసులకు బండి సంజయ్ తరపు న్యాయవాదులు 15 అంశాలతో కూడా నోటీసులను అందించారు.

Tags:    

Similar News