Anti Theft Locks | దొంగతనాలను నిరోధించే అలారం తాళం

మీరు ఇంటికి తాళం వేసి ఊరెళుతున్నారా? మీ ఇంట్లో దొంగలు పడకుండా నిరోధించేందుకు యాంటీ థెఫ్ట్ అలారం తాళాలు వేయాలని రామగుండం పోలీసులు శనివారం సూచించారు.;

Update: 2025-01-18 15:40 GMT

ఇళ్లు, కార్యాలయాల్లో దొంగతనాల నిరోధానికి వీలుగా కొత్తగా అలారం తాళాలు అందుబాటులోకి వచ్చాయి. రామగుండం పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ ఎం శ్రీనివాస్ యాంటీ థెఫ్ట్ అలారం తాళాల గురించి శనివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి తలుపులు, కిటికీలకు స్మార్ట్ యాంటీ థెఫ్ట్ అలారం తాళం వేస్తే చాలు దొంగలు వాటిని తెరిచేందుకు యత్నిస్తే మాగ్నటిక్ సెన్సార్ల సహాయంతో అలారం మోగుతుందని రామగుండం పోలీసు కమిషనర్ ఎం శ్రీనివాస్ చెప్పారు. అధునాతన భద్రతా సాంకేతికతతో వచ్చిన ఈ స్మార్ట్ తాళాల సాయంతో దొంగతనాలను నిరోధించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇళ్లు, గ్యారేజీలు, కార్యాలయాలు, గిడ్డంగులకు యాంటీ థెఫ్ట్ అలారం తాళం వేస్తే చాలు ఇవి దొంగలకు నిరోధకంగా పనిచేస్తాయని సీపీ శ్రీనివాస్ చెప్పారు. దొంగలు ఈ తాళాన్ని పగుల గొట్టేందుకు యత్నిస్తే 105 నుంచి 110 డెసిబుల్ శబ్దాలతో అలారం మోగిస్తూ నివాసితులతోపాటు చుట్టుపక్కల గృహాల వారిని అప్రమత్తం చేస్తుంది. ఈ అధునాతన తాళాల సహాయంతో దొంగతనాలను నియంత్రించవచ్చని పోలీసు కమిషనర్ ఎం శ్రీనివాస్ వివరించారు. ఇళ్లకు ఈ అధునాతన తాళాలు వేస్తే మీ ఇల్లు సురక్షితంగా ఉంటుందని ఆయన చెప్పారు.
పండుగలు, ఫంక్షన్లు, విహార యాత్రల కోసం ఇంటిల్లిపాది వెళితే మీ ఇంటికి సీసీ కెమెరాలు అమర్చి ఆన్ లైన్ లో పర్యవేక్షిస్తుండాలని పోలీసులు సూచించారు. ఇంట్లోని ఓ గదిలో లైటు వేసి ఉంచడం, తాళం వేసిన తర్వాత తలుపు కనిపంచకుండా కర్జెన్ వేయాలని పోలీసులు సూచించారు.హోం సెక్యూరిటీ వ్యవస్థను మొబైల్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాటు చేసుకోవాలి.


Tags:    

Similar News