GI TAG | ఆర్మూర్ పసుపు రైతులకు మరో శుభవార్త,త్వరలో జీఐ ట్యాగ్

నిజామాబాద్ పసుపు రైతులకు మరో శుభవార్త. పసుపు బోర్డు ఏర్పాటైన వెంటనే ఆర్మూర్ పసుపునకు భౌగోళిక గుర్తింపు లభించనుంది. శాస్త్రవేత్తలు పసుపు పొలాలను పరిశీలించారు.;

Update: 2025-01-23 01:26 GMT

జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ నగరంలో ఏర్పాటైన వెంటనే ఆర్మూరు ప్రాంతంలో పండిస్తున్న పసుపునకు భౌగోళిక గుర్తింపు ఇచ్చేందుకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అధ్యయన బృందం ముందుకు వచ్చింది.

- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో స్థానికంగా పండుతున్న విశిష్టతలు ఉన్న ఆర్మూరు పసుపు భౌగోళిక గుర్తింపు ఇచ్చేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం తాజాగా
క్షేత్రస్థాయి పరిశీలన చేసింది.



 ఆర్మూరులో శాస్త్రవేత్తల బృందం పర్యటన

నాబార్డు సౌజన్యంతో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు, ఉద్యాన కళాశాల మోజర్ల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య నేతృత్వంలో కమ్మరపల్లి
పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు బి.మహేందర్, పి.శ్రీనివాస్, నాబార్డ్ డి డి ఎం ప్రవీణ్ కుమార్ లతో కూడిన బృందం ఆర్మూర్ పసుపుకి భౌగోళిక గుర్తింపు కోసం అధ్యయనం విషయమై సమావేశమయ్యారు.ఆర్మూరు పసుపు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయడానికి కావాల్సిన సమాచారం, వాతావరణ పరిస్థితులు, భూమి లక్షణాలు, ఈ రకంలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు, ఆర్మూర్ పసుపు సాగు చరిత్ర, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొదలైన విషయాల గురించి ఉద్యానవన శాస్త్రవేత్తలు కూలంకషంగా చర్చించారు. ఆర్మూరు పసుపు పండించే ప్రాంతాలలో రైతు క్షేత్రాలను సందర్శించి సాగు చేస్తున్న పసుపు రకాల విశిష్ఠతను పరిశీలించారు.

పసుపుకి పసుపుకి జీఐ వస్తే...
పసుపుకి భౌగోళిక గుర్తింపు వచ్చినట్లయితే ఎగుమతులు పెరగటంతో పాటు, దేశవ్యాప్తంగా ఈ రకానికి మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని, అధిక ధరలు కూడా లభిస్తాయని ఈ ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు డాక్టర్ పిడిగం సైదయ్య చెప్పారు.



 నాలుగు నెలల్లోగా జీఐ కోసం దరఖాస్తు

ఆర్మూరు పసుపునకు భౌగోళిక గుర్తింపు కోసం చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న మేథో సంపత్తి హక్కుల కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు నుంచి నాలుగు నెలల్లో అప్లికేషన్ ని సమర్పించనున్నట్లు శాస్త్రవేత్తల బృందం తెలిపింది. త్వరలోనే ఆర్మూరు పసుపు రకానికి సంబంధించిన డిఎన్ఏ ప్రొఫైలింగ్, లక్షణాల వివరణ, ప్రయోగశాలలో వాటి నమూనాలను
పరిశీలించి అధ్యయనం చేయనున్నట్లు ఉద్యాన కళాశాల మోజర్ల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య తెలిపారు.


Tags:    

Similar News