కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున అద్దంకి దయాక్, విజయశాంతి, శంకర్ నాయక్‌ను బరిలో దిగనున్నారు.;
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. టీపీసీసీ సిఫార్సు చేసిన అభ్యర్థుల నుంచి ఏఐసీసీ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. నాలుగు స్థానాలు కాంగ్రెస్ రాగా వాటిలో ఒక ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్.. మిత్రపక్షం సీపీఐకి ఇచ్చింది. మిగిలిన మూడు స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున అద్దంకి దయాక్, విజయశాంతి, శంకర్ నాయక్‌ను బరిలో దిగనున్నారు.
కాగా సీపీఐ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అదే విధంగా ఐదో స్థానానికి బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోట చేసిన వారికి, కార్పొరేషన్ పదవులు ఉన్నవారికి అవకాశం ఇవ్వకూడదని నిశ్చయించారు. ఈ మేరకే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌కు అవకాశం దక్కింది.
నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 10 ఆఖరు తేదీ కావడంతో సోమవారం అభ్యర్థులంతా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్చి 11న అంటే మంగళవారం నామినేషన్ల పరిశీలన జుగుతుంది. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి మార్చి 13 ఆఖరుతేదీ. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీ కాలం మార్చి 29కి పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.