ఈ సారి అధికారం మాదే..తేజస్వి చెబుతున్న లెక్కలేంటి?

ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చిన 'మహాఘత్బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థి

Update: 2025-11-12 12:17 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో ఎన్నికలు ముగిశాయి. అధికార ఎన్డీయే (NDA) తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. అయితే ఆర్జేడీ(RJD) నాయకుడు, మహాఘట్‌బంధన్(Mahagathbandhan) ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్(Tejashwi Yadav) ఆ ఫలితాలను ఖండించారు. బీజేపీ అగ్ర నాయకత్వ ఆదేశానుసారం అంచనాలు ఉన్నాయని చెప్పారు. కాని ఈ సారి రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA bloc) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం (నవంబర్ 12) పాట్నాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మంగళవారం వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి వస్తుందని, ప్రతిపక్ష 'మహాఘత్బంధన్' (స్థానిక పరిభాషలో ఇండియా బ్లాక్) కు పేలవమైన ప్రదర్శన ఉంటుందని, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జాన్ సూరజ్ పార్టీకి నిరాశపరిచే ప్రదర్శన ఉంటుందని అంచనా వేసింది.


‘18న ప్రమాణ స్వీకారం చేస్తాం’

"ఇండియా కూటమి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరిగింది. అంటే జనం మార్పును కోరుకుంటున్నారని అర్థం. వారంతా 'మహాఘత్బంధన్'కు అనుకూలంగా ఓటు వేశారు. అధికారంలోకి వచ్చేది మేమే. నవంబర్ 18న ప్రమాణం స్వీకారం చేస్తాం," అని తేజస్వి విశ్వాసం వ్యక్తం చేశారు.

మలిదశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 69 శాతం పోలింగ్ నమోదయిన విషయం తెలిసిందే. నవంబర్ 6న జరిగిన తొలి దఫాలో 121 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 3.75 కోట్ల మంది ఓటేశారు. ఓటింగ్ శాతం 65.09 గా నమోదయ్యింది. ఇది బీహార్ చరిత్రలో రికార్డు స్థాయి ఓటింగ్. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న మొదలవుతుంది.  

Tags:    

Similar News