డీలిమిటేషన్ పై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతుందా?
తమిళనాడు ప్రతినిధి బృందానికి వేర్వేరు సమాధానాలు చెప్పిన సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్;
By : 311
Update: 2025-03-13 09:59 GMT
రాజ్యాంగం ప్రకారం వచ్చే సంవత్సరం లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. అందుకోసం మోదీ సర్కార్ సర్వం సిద్దం చేసింది. అయితే పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందుని తమిళనాడు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళనాడు ముఖ్యమంత్రి ఈ విషయంపై మాట్లాడటానికి మార్చి 22న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. ఈ సమావేశానికి హజరుకావాలని అభ్యర్థిస్తూ తమిళనాడు ప్రతినిధి బృందం బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసింది. దక్షిణాది అప్రమత్తం కాకపోతే ఉత్తరాది రాష్ట్రాలు భారీగా ప్రయోజనం పొందుతాయని తమిళనాడు వాదిస్తోంది.
సందిగ్థంలో కాంగ్రెస్
ఈ ప్రతినిధి బృందానికి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి రెండు భిన్నమైన సమాధానాలు వచ్చాయి. ఇవి రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలను హైలెట్ చేశాయి. ప్రాంతీయ ఆకాంక్షలను జాతీయ రాజకీయ వ్యూహంతో సమతుల్యం చేయడంపై ఉన్న సవాల్లను తేటతెల్లం చేశాయి.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రస్తుతం ఒక అనిశ్చిత స్థితిలో ఉంది. చారిత్రతాత్మకంగా, భాషా వైవిధ్యాన్ని సమతుల్యం చేయడానికి కాంగ్రెస్ త్రిభాషా సూత్రాన్ని అమలు చేసింది. కానీ ఈ విధానం హిందీ బెల్ట్- దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఉత్తర భారత రాష్ట్రాలకు అనుగుణంగా ఉండే విభజన ను దక్షిణాది రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి అంగీకరిస్తే ఉత్తరాదిన కాంగ్రెస్ కచ్చితంగా బలహీనపడుతుంది.
సిద్ధరామయ్య మద్దతు..
ప్రాంతీయ వాదానికి ఆది నుంచి మద్దతు ఇచ్చే సిద్ధరామయ్య తమిళనాడు చేస్తున్న పోరాటాలకు సైతం మద్దతు ఇచ్చారు. కర్ణాటక రాజకీయ ప్రభావాన్ని బలహీనపరిచే, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే, రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించే సూత్రాలను ఎవరూ తీసుకున్న తాను వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు స్టాలిన్, సిద్ధరామయ్య తో ఫోన్ లో మాట్లాడారు. బెంగళూర్ లో తమిళనాడు అటవీ శాఖామంత్రి కె. పొన్ముడి, రాజ్యసభ ఎంపీ మహ్మద్ అబ్దుల్లా ఇస్మాయిల్ తో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న పోరాటంలో వారికి అండగా నిలబడతామని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు.
డీకే ఏమన్నారు..
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా అయిన శివకుమార్ బ్యాలెన్స్ డ్ విధానాన్ని సూచించారు. ఒక జాతీయ పార్టీగా ఈ విషయంపై నిర్ణయం తీసుకునే ముందు కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదించాలన్నారు.
‘‘ఈ విషయంపై మా పార్టీ నాయకులతో మాట్లాడాలి. వారి నిర్ణయం ప్రకారం మా తదుపరి చర్యలు ఉంటాయి. మేము తమిళనాడు ప్రతినిధులకు అదే విషయాన్ని తెలియజేశాం’’ అని శివకుమార్ సమావేశం తరువాత చెప్పారు.
చెన్నైలో జరిగే సమావేశానికి తాను వస్తా అంటూనే ఆయన పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం మానేశారు. అయితే స్టాలిన్ తమ కూటమి అయినందునే దీనిపై కాంగ్రెస్ వైఖరి ఇదే విధంగా ఉంటుందని భావిస్తున్నారు. ‘‘ మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మనం కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ఆయన అన్నారు.
వ్యవస్థాగత పక్షపాతం..
డీలిమిటేషన్ విషయంలో సిద్ధరామయ్య తమిళనాడుకు మద్దతు ఇవ్వడం రాజకీయ ప్రాతినిధ్యం న్యాయంగా ఉండాలనే కారణం ఉంది. కర్ణాటక, తమిళనాడుతో సహ దక్షిణాది రాష్ట్రాలు తమ జనాభా పెరుగుదలను సమర్థంగా నిలువరించాయి. ఇప్పుడు జనాభా ఆధారంగా జరిగే లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన తమ స్థానాలు తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తమిళనాడు ఆందోళనకు మద్దతు ఇవ్వడం ద్వారా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలపై విధించిన అన్యాయమైన శిక్షగా తాను భావిస్తున్నారు. దీనిని ఎదుర్కోవడం ద్వారా జాతీయరంగంలో వారి రాజకీయ ప్రభావం తగ్గకుండా చూసుకోవడం సిద్దరామయ్య లక్ష్యం.
గ్రాంట్ల పంపిణీ, కేటాయింపులు, పన్ను వికేంద్రీకరణను ప్రభావితం చేసే కేంద్ర నిర్ణయాలకు పెద్ద ఎత్తున ప్రతిఘటించే జాబితాలో సిద్ధరామయ్య భాగం అవుతున్నారు. వీటికి కూడా భవిష్యత్ లో జనాభా నే ప్రాతిపదికం అవుతుంది.
రాజకీయ విశ్లేషకుడు సీ రుద్రప్ప ప్రకారం..‘‘నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తమిళనాడుతో పొత్తుపెట్టుకోవడం అనేది వ్యవస్థాగత పక్షపాతాన్ని హైలైట్ చేస్తుంది. గ్రాంట్లు, పన్ను వికేంద్రీకరణకు సంబంధించిన నిర్ణయాలలో ఇదే విధమైన తర్కం ఉండవచ్చని సూచిస్తుంది. జనాభా కేంద్రీకృత సూత్రాలు, మెరుగైన జనాభా నియంత్రణ చర్యలు, బలమైన ఆర్థిక వ్యవస్థలు కలిగిన రాష్ట్రాలకు ప్రతికూలతను కలిగిస్తాయి’’ అని ఆయన అన్నారు.
ప్రాంతీయ ఆసక్తులు..
ఈ సమష్టి వైఖరి ప్రాంతీయ ప్రయోజనాలను, సమతుల్య ఆర్థిక లక్ష్యాలను సమర్థించే దక్షిణాది నాయకుల గొంతులను విస్తృతం చేయడానికి వేదికగా ఉపయోగపడుతుంది.
కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు డిలిమిటేషన్ పై కేంద్ర విధానాలను సవాలు చేస్తున్నప్పుడూ, దేశ వ్యాప్తంగా గ్రాంట్లు, పన్ను ఆదాయాల కేటాయింపులో సంస్కరణలను కూడా పరోక్షంగా కోరుతున్నాయని అర్థం.
న్యాయమైన ప్రక్రియ చారిత్రక, అభివృద్ది అసమానతలను గుర్తించడమే కాకుండా స్థానిక సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇస్తుందని వారి వాదన.
దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ఏకపక్ష విధానాల వల్ల శిక్షించబడకుండా, స్థిరమైన వృద్ది, అభివృద్ది కోసం వనరులలో వారి వాటాను పొందేలా చూసుకుంటూ, సమానమైన ఆర్థిక విధానాల డిమాండ్ ను ఈ ఐక్య ప్రతిఘటన ఉపయోగపడుతుంది.
అయితే తమిళనాడు ప్రతినిధి బృందానికి మద్దతు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీలో కనిపించిన విభేదాలు జాతీయ పార్టీగా ఆ పార్టీ ఎదుర్కొంటున్న సందిగ్థతలను హైలైట్ చేస్తాయి.