తమిళనాడులో నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్ కు హజరవుతాం: అన్నాడీఎంకే
జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజక వర్గాల విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆందోళన;
By : Praveen Chepyala
Update: 2025-03-01 07:58 GMT
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.
ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏఐడీఎంకే సైతం హజరయి తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని పార్టీ జనరల్ సెక్రటరీ పళని స్వామి వెల్లడించారు.
‘‘చెన్నైలో మార్చి 5 న నిర్వహించబోయే సమావేశానికి ఏఐడీఎంకే తరఫున ఇద్దరు ప్రతినిధులు హజరవుతారు’’ అని పళని స్వామి విలేకరులతో అన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 77 వ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన డొనేషన్ క్యాంపును ప్రారంభించిన ఆయన, అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమ అభిప్రాయాలను అక్కడ వెలువరిస్తామని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో సమావేశం కావాలని ఎంకే స్టాలిన్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన 45 పార్టీలను ఈ సమావేశాలకు ఆహ్వనం పంపారు.
ఈ సమావేశానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్న పీఎంకే సైతం హజరవుతామని ప్రకటించింది. ఇప్పటికే చాలా పార్టీలు లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన తమ అభిప్రాయాలను వెల్లడించాయి. దీనివల్ల తమిళనాడు సహ ఇతర రాష్ట్రాలలో సీట్లు తగ్గుతాయని, దీనికి మేము అంగీకరించేది లేదని అంటున్నాయి.
‘‘ సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. మార్చి 5న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించబోతున్నాం. నియోజకవర్గాల డిలిమిటేషన్ గురించి చర్చించబోతున్నాం. కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి జనాభాను తగ్గించడం వల్ల ఎనిమిది స్థానాలు కోల్పోతున్నాం.’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.