DMKతోనే ఉంటామన్న VCK ..

తమిళనాడులో బీజేపీ వృద్ధి ఏఐఏడీఎంకేతో పొత్తుపై ఆధారపడి ఉంటుందన్న తిరుమావళవన్;

Update: 2025-04-22 11:05 GMT

వచ్చే తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకేతో కలిసి పోటీచేయనుంది విడుతలై చిరుతైగల్ కచ్చి (VCK). ఎలాంటి షరతులు లేకుండా ఎంకే స్టాలిన్ పార్టీ(CM Stalin)తో జతకడతామని ఆ పార్టీ నేత థోల్ తిరుమావళవన్ (Thirumavalavan) చెప్పారు. 2021 అసెంబ్లీ ఎన్నికలతో కూడా DMKకు మద్దతు ఇచ్చాం. పార్టీ విస్తరణకు ఈసారి మరిన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిర్ణయం చర్చల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు.

ది ఫెడరల్‌తో మాట్లాడుతూ .. ప్రజలు దేవాలయాలను సందర్శించడం అంటే బీజేపీ(BJP)కి ఓటు వేయడంతో సమానం కాదని దళిత నాయకుడు నొక్కిచెప్పారు. సామాజిక న్యాయం పట్ల ఉమ్మడి నిబద్ధతతో నడిచే డీఎంకే మిత్రపక్షంగా తన పార్టీ కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇమేజ్‌ను పెంచుకోవడంపై దృష్టి పెట్టిన బీజేపీ ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఓట్ల శాతాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించిందని చెప్పారు. పార్టీకి స్థానికంగా బలమైన క్యాడర్ లేకపోవడంతో తమిళనాడులో బీజేపీ బలపడదని అభిప్రాయపడ్డారు. హిందూ దేవాలయాలకు వెళ్లేవారంతా బీజేపీకి ఓటు వేస్తారనుకోవడం అవివేకమన్నారు. మత విశ్వాసాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదన్నారు. చాలా మంది హిందూ భక్తులు డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు.

"మేము హిందూ భక్తుల నమ్మకాలకు వ్యతిరేకం కాదు. మా పోరాటం సామాజిక న్యాయం, సమానత్వం కోసం’’ పోరాడుతుంది అని చెప్పారు.

డీఎంకే మంత్రి కె. పొన్ముడిపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ విషయంతో స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇప్పటికే ఆయన తగిన చర్య తీసుకున్నారు” అని చెప్పారు. 

Tags:    

Similar News