తమిళనాడులో మరోసారి ‘వీసీ వర్సెస్ ప్రభుత్వం’ పోరాటం
ఊటీలో వీసీలతో సమావేశం కాబోతున్న గవర్నర్, ఉపరాష్ట్రపతి ధంఖర్;
Translated by : Praveen Chepyala
Update: 2025-04-22 11:11 GMT
(మూలం.. మహాలింగం పొన్నుస్వామి)
రాష్ట్ర విశ్వవిద్యాలయాల నియంత్రణపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ ఎన్ రవి మధ్య మరోమారు పోరాటం ప్రారంభమైంది. వైస్ ఛాన్స్ లర్ సమావేశాలను ఏర్పాటు చేసే అధికారం, స్నాతకోత్సవాలకు అధ్యక్షత వహించే అధికారం గవర్నర్ కార్యాలయం తనకు ఉందని ప్రకటించింది. సుప్రీంకోర్టు ఏప్రిల్ 8, 2025 ఇచ్చిన తీర్పు ప్రకారం ఆయన ఛాన్సలర్ గా కీలక అధికారాలను తొలగింగించింది.
ఈ నెల 25-26 న ఊటీ సమావేశాన్ని నిర్వహించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్ కు ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ను ఆహ్వానించినట్లు సమాచారం. దీనిపై డీఎంకే, కాంగ్రెస్, ద్రవిడర్ కజగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంతీర్పును అపహాస్యం చేస్తున్నారని కోర్టు ధిక్కార ఆరోపణలు చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానాలు..
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఓ మైలురాయి. డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించింది.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించలేదు. వాటిలో ఎనిమిది విశ్వవిద్యాలయాల పాలనా సంస్కరణల కోసం ఉద్దేశించినవి.
ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు రాజ్యాంగబద్దంగా లభించిన ఆర్టికల్ 142 ను ప్రయోగించిన కోర్టు, గవర్నర్ నిష్క్రియాత్మకతను ఆర్టికల్ 200 ప్రకారం.. రాజ్యాంగ విరుద్దం అని ప్రకటించింది.
నవంబర్ 18, 2023 న బిల్లులను తిరిగి ఆయనను సమర్పించినప్పటి నుంచి ఆ బిల్లులను చట్టంగా పరిగణించింది. ఈ చట్టాలు గవర్నర్ నుంచి వీసీలను ఛాన్సలర్ గా నియమించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేశాయి. విశ్వవిద్యాలయ పరిపాలనలో ఆయన పాత్రను తగ్గించాయి.
తీర్పు తరువాత ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ నియంత్రణను నిర్థారించడానికి వేగంగా పావులు కదిపారు. ఏప్రిల్ 15న ఉన్నత విద్యాసంస్కరణలపై చర్చించడానికి వీసీలు, రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించారు.
ఇది సాంప్రదాయకంగా గవర్నర్ నిర్వహించేవారు. అయితే సుప్రీం తీర్పు తరువాత ఆ పాత్రను సీఎం తీసుకున్నారు. సీఎం సమావేశంలో మాట్లాడుతూ.. అహేతుక ఆలోచనలు, కథల నుంచి విద్యార్థులను రక్షించాల్సిన అవసరం ఉందని స్టాలిన్ చెప్పారు.
విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలను ప్రభావితం చేయడానికి గవర్నర్ చేసిన ప్రయత్నాలను ఇది అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. రాష్ట్ర చర్యలు కొత్త చట్టాలను పూర్తిగా అమలు చేయాలనే దాని ఉద్దేశాన్ని నొక్కి చెప్పాయి. స్టాలిన్ ను వీసీ నియమాకాలను ఏకైక సుప్రీం అధికారిగా చేశాయి.
స్పందించిన గవర్నర్ కార్యాలయం..
సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ చాన్సలర్ గవర్నర్ కు గణనీయమైన అధికారాలు ఉంటాయని రాజ్ భవన్ వాదిస్తోంది. కోర్టు తీర్పు ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి వీసీలను నియమించే అధికారాన్ని మాత్రమే బదిలీ చేసిందని, ఇతర ఛాన్సలర్ల విధులను అలాగే ఉంచిందని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది.
వీటిలో స్నాతకోత్సవాలకు అధ్యక్షత వహించడం, సిండికేట్ సమావేశాలకు హాజరుకావడం, విద్యా చర్చల కోసం వీసీలను సమావేశపరచడం ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా, గవర్నర్ ఊటీలో వీసీ సమావేశాలను నిర్వహిస్తున్నారని, ఈ సంప్రదాయం ఆయన పరిధిలోనే ఉందని ఆ ప్రకటన పేర్కొంది.
‘‘గవర్నర్ ఆర్ ఎన్ రవి రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ గా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు కేవలం వీసీ నియామకాలకు సంబంధించినది. స్నాతకోత్సవాలు, వీసీ సమావేశాలు నిర్వహించే ఛాన్సలర్ హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని అధికారి తెలిపారు.
రాబోయే వీసీ సమావేశం ప్రణాళిక ప్రకారం జరుగుతుందని రాజ్ భవన్ వర్గాలు ‘ది ఫెడరల్’ కు తెలిపాయి. ఊటీ వైస్ ఛాన్సలర్ సమావేశంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ పాల్గొనడం గురించి ఆరా తీసినప్పుడూ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కిర్లోష్ కుమార్ ఐఏఎస్ మాట్లాడారు. ‘‘సంబంధిత వివరాలన్నింటినీ రేపు ఒక పత్రికా ప్రకటన రేపు జారీ చేస్తాం’’ అని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టే వ్యాఖ్యల ద్వారా న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం విమర్శించిన ధంఖర్ కు ఇటీవల ఆహ్వానం పంపడం వివాదానికి ఆజ్యం పోసింది. గవర్నర్ చర్యను కోర్టు అధికారాన్ని సవాల్ చేయడానికి, తమిళనాడు విశ్వవిద్యాలయాలపై కేంద్ర ప్రభుత్వ ప్రభావాన్ని నొక్కి చెప్పడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నంగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
రాజకీయ ప్రతిచర్యలు...
గవర్నర్ అధికారాలను ఎలా అర్థం చేసుకోవాలో న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తారు. సీనియర్ న్యాయవాదీ కేఎం విజయన్ వాదిస్తూ.. ఛాన్సలర్ పాత్ర చట్టబద్దమైనదని, ఇప్పుడు సవరించబడిన విశ్వవిద్యాలయా చట్టాలతో ముడిపడి ఉందని అన్నారు.
‘‘ఈ చట్టాలను అమలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు తీర్పు, గవర్నర్ ఛాన్సలర్ అధికారాన్ని సమర్థవంతంగా తగ్గించింది’’ అని విజయన్ అన్నారు. ఏప్రిల్ 8 తీర్పుకు ముందే ఊటీ సమావేశం ప్రకటించారు.
దీనిని ముందుగా షెడ్యుల్ చేసిన కార్యక్రమంగా రూపొందించవచ్చని డీఎంకే న్యాయ విభాగం న్యాయవాదీ పేర్కొన్నారు.
‘‘గవర్నర్ కు ఎటువంటి అధికారం లేని ఛాన్సలర్. ఆయన సమావేశాలు నిర్వహించగలరు. కానీ గవర్నర్ ఆదేశాలకు చట్టపరమైన అధికారం లేదు. నిజమైన అధికారం అంతా తమిళనాడు ప్రభుత్వం వద్ద మాత్రమే ఉన్నాయి’’ అని న్యాయవాదీ అన్నారు.
ఊటీ సమావేశాన్ని డీఎంకే, కాంగ్రెస్, ద్రవిడర్ కజగం వ్యతిరేకించాయి. ద్రవిడర్ కజగం నాయకుడు కే. వీరమణి ఒక ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ కార్యాలయాన్ని రాజ్యంగ ఉల్లంఘన, కోర్టు ధిక్కార చర్యగా అభివర్ణించారు.
గవర్నర్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. వీసీలు సమావేశాన్ని బహిష్కరించాలని కోరారు. అలా కాదని వెళ్తే చట్టపరమైన బాధ్యతలను ఉల్లంఘించడే అవుతుందని హెచ్చరించారు.
వీరమణి కూడా ధంఖర్ ప్రమేయాన్ని విమర్శించారు. ఉపరాష్ట్రపతి అగ్నికి ఆజ్యం పోస్తున్నారని అన్నారు. రాజ్యసభలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పిలుపునిచ్చారు.
గవర్నర్ అధికారాలను నిలుపుకుంటారు?
అన్నా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఇ. బాలగురుసామి, గవర్నర్ ఛాన్సలర్ గా కొన్ని అధికారలను నిలుపుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్, వైస్ ఛాన్సలర్ల మధ్య విభేదాలను తలెత్తితే విశ్వవిద్యాలయం పనితీరుకు అంతరాయం కలుగుతుందని హెచ్చరించారు.
క్రమబద్దమైన పాలనను అందించడానికి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ నమూనాను అనుసరించాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా పనిచేస్తారని చెప్పారు.
బాలగురు స్వామి ప్రకారం.. గవర్నర్ అధికారాలు..
1. కనీసం 10 విశ్వవిద్యాలయాలలో వీసీ శోధన కమిటీలకు నామినీలను నియమించండి
2. కనీసం 16 వర్శిటీలలో పాలక సంస్థలు నిర్ణయాలు ఆమోదించడం, నిలిపివేయడం
3. రికార్డులను సమీక్షించండి
4. విశ్వవిద్యాలయా విషయాలపై విచారణలు, తనిఖీలను ఆదేశించడి
5. సిండికేట్, సెనేట్, విద్యామండలికి సభ్యులను నామినేట్ చేయండి
6. విశ్వవిద్యాలయ సంస్థలను ఎన్నికలు, నామినేషన్లలో వివాదాలపై తుది నిర్ణయం
విశ్వవిద్యాలయాలను రాజకీయ జోక్యం నుంచి కాపాడటానికి రూపొందించిన పద్దతి అయిన గవర్నర్ కు వీసీ నియామాకాలను అప్పగించడానికి ఉన్న చారిత్రక హేతుబద్దతను బాలగురుస్వామి లేవనెత్తారు.
ఈ ఆకస్మిక మార్పును ఆయన విమర్శించారు. ఇది తమిళనాడు ఉన్నత విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసే రాజకీయ జోక్యానికి తలుపులు తెరిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దుర్వినియోగాలు..
గతంలో జరిగిన తప్పులను ఆయన గుర్తు చేశారు. 2006 నుంచి 2017 వరకూ రాజకీయ పక్షపాతం, అవినీతి వీసీ నియమాకాలను దెబ్బతీశాయని ఆయన చెప్పారు. వీటిలో రాజకీయ నాయకుల బంధువులు, పాలక పార్టీ విధేయులు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆధిపత్య కులాల సభ్యుల నియమాకాలు పెద్దమొత్తంలో ఉన్నాయన్నారు.
బంగారం అక్రమ రవాణా కేసులో దోషిగా తేలి తీహార్ జైలులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని వీసీ గా నియామించారని ఆయన ప్రస్తావించారు. ఇందుకోసం ప్రభుత్వాలు గవర్నర్లను తమ జేబుల్లో నిలుపుకున్నాయి.
అవినీతి, పక్షపాతం, అర్హత కలిగిన నిజాయితీపరులైన, సమర్థులైన వీసీలను మాత్రమే నియమించాలని బాలగురుస్వామి స్టాలిన్ ను కోరారు. ‘‘తమిళనాడు విశ్వవిద్యాలయాల స్వేచ్ఛ, సమగ్రత ప్రమాదంలో ఉన్నాయి. నియామకాలలో రాజకీయ జోక్యం ఇప్పటికే పేలవంగా ఉన్న ఉన్నత విద్య, పరిశోధన నాణ్యతను మరింత క్షీణింపజేస్తుంది’’ అని ఆయన హెచ్చరించారు.
వీసీలను నియమించాలి
సుప్రీం తీర్పు రాష్ట్రానికి వీసీలను నియమించే అధికారం కల్పించినప్పటికీ వీసీ సెర్చ్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున తమిళనాడు ప్రభుత్వం ఇంకా ఆ ప్రక్రియను ప్రారంభించలేదని డీఎంకే న్యాయవిభాగం వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడు రాష్ట్ర విశ్వవిద్యాలయలకు వైస్ ఛాన్సలర్ల వీసీ నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని పరిష్కరించాలని మద్రాస్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఎస్పీ త్యాగరాజన్ తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
‘‘సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున వీలైనంత త్వరగా వైస్ ఛాన్సలర్లను నియమిస్తారని మేము ఆశిస్తున్నాము. అన్ని విశ్వవిద్యాలయాలు సమర్థవంతంగా పనిచేయాలంటే వీసీలు ఉండాలి. వీసీ పదవులలో దీర్ఘకాలిక ఖాళీలు విశ్వవిద్యాలయ కార్యకలాపాలకు వృద్దికి ఆటంకం కలిగిస్తాయి’’ అని ఆయన అన్నారు.