డీఎంకే- బీజేపీ వివాదంపై స్పందించిన టీవీకే చీఫ్ విజయ్
హిందీ విషయంలో చిన్న పిల్లల్ల గొడవపడుతున్నారని వ్యాఖ్య;
By : Praveen Chepyala
Update: 2025-02-26 11:37 GMT
ప్రస్తుతం నేషనల్ ఎడ్యూకేషనల్ పాలసీలో భాగంగా తీసుకొచ్చిన త్రిభాష విధానంపై తమిళనాడులో రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నటుడు తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధిపతి విజయ్ స్పందించారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ గొడవలను కిండర్ గార్టెన్( కేజీ) విద్యార్థులలో జరిగే పోరాటంలా అభివర్ణించారు.
ఎన్ఈపీ పై వైరం..
తమిళనాడులో జాతీయ విద్యావిధానం 2020 ని అమలు చేయడానికి ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో హిందీని రుద్దడానికి కేంద్రం పన్నిన కుట్రలుగా డీఎంకే ఆరోపిస్తోంది. సమగ్ర శిక్ష కింద తమిళనాడు ప్రభుత్వానికి ఎన్ఈపీ అమలు చేసే వరకూ కేంద్రం రూ. 2400 కోట్ల నిధులను నిలిపివేసింది.
వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగుతున్నప్పుడూ తన ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించడానికి విజయ్ సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం బీజేపీ, డీఎంకే మీద ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు పార్టీల మధ్య లోపాయికారీగా ఉన్న సంబంధాలను బహిర్గతం చేయాలనే తన సంకల్పాన్ని కూడా బయటపెట్టారు.
త్రిభాష విధానంపై..
ఎన్ఈపీ కింద అండర్ లైన్ చేయబడిన త్రిభాషా విధానానికి వ్యతిరేకిస్తూ ఇది సమాఖ్య స్పూర్తికి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ద్విభాష విధానానికి విరుద్దమని విజయ్ అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం ఎన్ఈపీ అమలు చేసే వరకూ సమగ్ర శిక్ష కింద నిధులను నిరాకరించడం పై కూడా ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
బీజేపీకి చెందిన కొంతమంది నాయకులు కూడా ఇప్పటికే టీవీకే పార్టీలో చేరారు. తాజాగా ఓ జిల్లా అధ్యక్షురాలు విజయ్ పార్టీలో చేరారు. దీంతో అక్కడ రాజకీయాలు బీజేపీ వర్సెస్ తమిళపార్టీలుగా మారాయి.