‘సర్’ తో దక్షిణాదిలో పెద్దగా తొలగింపులు ఉండవు

టాకింగ్ విత్ శ్రీని లో విశ్లేషించిన ది ఫెడరల్ చీఫ్ ఎడిటర్

Update: 2025-10-29 08:34 GMT

విజయ్ శ్రీనివాస్

భారత ఎన్నికల సంఘం ఓటర్ల సవరణ జాబితా 2.0 ప్రారంభించడానికి 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో సన్నాహాలు చేస్తున్నామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, పినరయీ విజయన్ ఇద్దరు ఈ చర్యను ఓటర్ అణచివేత ప్రక్రియగా ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం అతిగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు.
ది ‘ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ప్రారంభించిన సమయం అనేక సందేహాలకు తావిస్తోంది. ‘‘బీహార్ లో ప్రారంభమైనప్పుడూ ఎన్నికల సంఘం దీనిని ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించినున్నట్లు చెప్పింది. ఆ కోణంలో ఈ రెండో దశ ప్రారంభించారు’’ అని ఆయన టాకింగ్ సెన్స్ విత్ శ్రీ నిలో అన్నారు. అయితే ఈసీ విశ్వసనీయత దెబ్బతిందని, బీహార్ నుంచి అది ఏమైనా పాఠాలు నేర్చుకుందా అని ఆయన ప్రశ్నించారు.
ఈసీ ఇమేజ్ కి డెంట్..
ఈ సంవత్సరం ప్రారంభంలో బీహార్ లో ఈసీ చేపట్టిన మొదటి దశ ఓటర్ల సవరణ, ఓటు హక్కు తీసేశారని ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ‘‘కమిషన్ తనను తాను సమర్థించుకోలేదు’’ అని శ్రీనివాసన్ అన్నారు.
‘‘బీహార్ తరువాత దాని ప్రతిష్ట మసకబారింది. అధికార పార్టీకి ప్రతికూలంగా భావిస్తున్న ఓటర్లను తొలగిస్తున్నారనే ఆందోళన వ్యక్తం అవుతోంది’’ అని ఆయన అన్నారు.
బీహార్ డేటా తో ముదిరిన అనుమానాలు..
బీహార్ లో తొలగించిన డేటాలో అత్యధిక శాతం ముస్లింలు ఉన్నారని శ్రీనివాసన్ అన్నారు. ‘‘65 లక్షల మంది తొలగించిన ఓటర్లలో 25 లక్షల మంది ముస్లింలు ఉన్నారు’’ అని యోగేంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ను ఉదహరించారు.
బీహార్ లో ముస్లిం జనాభా కేవలం 17 శాతం మాత్రమే అని, కానీ ఒక నిర్ధిష్ట సంఖ్యలో సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి సర్ ను ఉపయోగించారని ఆయన అన్నారు.
సర్ 2.0 ఎందుకు వివాదాస్పదం..
ఓటర్ల జాబితా నుంచి చట్టవిరుద్దంగా పౌరులను తొలగించడం మూలంగా ఈసీ సవరణపై వివాదం చెలరేగినట్లు శ్రీనివాసన్ అన్నారు. విమర్శకులు ఈ చర్యను రాజ్యాంగాన్ని మించిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు.
‘‘పౌరసత్వాన్ని నిర్ణయించడం ఎన్నికల కమిషన్ పనికాదని శ్రీనివాసన్ అన్నారు. పౌరసత్వ సమస్య కోర్టులు తేల్చాలి. అయినప్పటికీ దానిని ఈ ప్రక్రియకు సమర్థనగా ఉపయోగిస్తోంది. అందుకే అనుమానం వ్యక్తం చేస్తున్నారని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
పెద్ద ఎత్తున మాన్యువల్ గణనను నిర్వహించడం కంటే నకిలీ ఓటర్లను గుర్తించడానికి ఈసీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవచ్చని ఆయన సూచించారు. అయితే నకిలీని తొలగించడానికి సాప్ట్ వేర్ ను ఎందుకు ఉపయోగించకూడదని అడిగినప్పుడూ ప్రధాన ఎన్నికల కమిషనర్ అది అవసరం లేదని అన్నారు. ‘‘ఇది నిజమైన సవరణ ఉద్దేశ్యంపై సందేహాలను పెంచుతుంది’’ అని శ్రీనివాసన్ అన్నారు.
దక్షిణాది రాష్ట్రాల నిరసనలు..
పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ‘సర్’ పై హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
కేరళ, తమిళనాడు ‘సర్’ రాజకీయ సాధనంగా చూస్తున్నాయి. సీఎంలు స్టాలిన్, విజయన్ లు దక్షిణాది ఓటర్ల ఓటు హక్కును తొలగించే ప్రయత్నంగా సర్ ను చిత్రీకరిస్తున్నారు. దీనిని ప్రాంతీయ గుర్తింపు సమస్యగా మారుస్తున్నారని ఆయన అన్నారు.
‘‘అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున తొలగింపులను ఎదుర్కొనే అవకాశం లేదని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. తమిళనాడు, కేరళలో డీఎంకే, వామపక్షాలు, కాంగ్రెస్ వంటి పార్టీలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇది రాజకీయమైంది. బీజేపీ ఉత్తరాది కథనాన్ని ఎదుర్కోవడానికి ఇది ఒక మార్గం’’ అని ఆయన అన్నారు.
అస్థిరమైన విధానం..
హస్యాస్పదంగా అక్రమ వలసల అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అస్సాంను ‘సర్’ 2.0 నుంచి మినహయించారు. ‘‘అదై వైరుధ్యం. అక్రమార్కులను గుర్తించడమే లక్ష్యం. అయితే అస్సాంను ఎందుకు వదిలివేయాలి? ఎన్ఆర్సీ సంబంధిత కేసులు విచారణలో ఉన్నాయని ఈసీ వాదన.
కానీ అది దాని విధానంలోని అస్థిరతను వెల్లడి చేస్తుంది’’ అని శ్రీనివాసన్ అన్నారు. అస్సాంలో 2019 జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) హిందువులు హిందువులు, ముస్లింలలో చెరో 19 లక్షల మందిని మినహాయించింది. ఇది చాలాకాలంగా రాజకీయ ప్రతిష్టంభనకు దారితీసింది. ‘‘ఎన్ఆర్సీ ఫలితాలు ఇంకా రాకపోతే ఈసీ జాబితాను ఓటర్ జాబితాకు ఆధారంగా ఉపయోగించాలని అనుకుంటుందా.. లేదా .. అని అస్పష్టంగా ఉంది.
ఈసీ చర్యను వ్యతిరేకిస్తూ కేరళ ఇప్పటికే శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు దీనిని సమాఖ్య ఘర్షణగా చిత్రీకరిస్తోంది. ‘‘ఈసీకి రాజ్యాంగబద్దంగా స్వయంప్రతిపత్తి ఉంది. కాబట్టి రాష్ట్రాలు దీనిని ఆపలేవు. కానీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ఘర్షణలు పక్షపాత భావనలు పెంచుతాయి’’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు.
ఈ వివాదం మరోసారి ఎన్నికల తటస్థతను ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. ‘‘ అంపైర్ న్యాయంగా వ్యవహరిస్తారని నిరూపించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. ఇది పారదర్శకత ఒక అవకాశం. కానీ కమిషన్ కమ్యూనికేషన్(సమాచార మార్పిడి) అస్పష్టంగానే ఉంది’’ అని శ్రీనివాసన్ అన్నారు.
కుటుంబ సభ్యులు లేదా స్థానిక ఏజెంట్లు ఇతరుల తరఫున ఫారమ్ సమర్పించడానికి అన్ని ఓటర్లు తిరిగి నమోదు చేసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించడానికి ఈసీ కొన్ని విధానపరమైన సడలింపులను ప్రవేశపెట్టిందని శ్రీనివాసన్ అంగీకరించారు.
‘‘ఇవి పౌరులు, అధికారులు, ఇద్దరికి ఒత్తిడిని తగ్గించే ఆచరణాత్మక చర్యలు కానీ అవి ప్రధాన సమస్యను పరిష్కరించవు. ఈ ప్రక్రియ నిజంగా రోల్స్ శుభ్రం చేయడం గురించినా లేదా రాజకీయపరమైనదేనా’’ అని శ్రీనివాసన్ అన్నారు.


Tags:    

Similar News