తమిళనాడు లాకప్ డెత్: మాట మార్చిన ఫిర్యాదుదారు
అసలు ఆభరణాలు పోయాయా? ఎఫ్ఐఆర్ లేకుండా విచారించిన పోలీసులు.. జేపీ నికితాపై ఇంతముందే నమోదైన చీటింగ్ కేసు;
By : The Federal
Update: 2025-07-03 06:37 GMT
మహాలింగం పొన్నుస్వామి
తమిళనాడులో అమాయకుడి లాకప్ డెత్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సెక్యురిటీ గార్డుపై దొంగతనం ఆరోపణలు చేసిన జేపీ నికితా అనే మహిళపై ఇంతకుముందే ఓ చీటింగ్ కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రెండు వాదనలు వినిపించి మీడియాకు దొరికిపోయింది.
2011 లో ఓ మోసం కేసులో ఆమెపై ఆరోపణలు సందేహాలు రేకెత్తిస్తుండగా, పోలీసులు సైతం ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విఫలం అయ్యారని, అంతేకాకుండా బాధితుడి పట్ల క్రూరంగా వ్యహరించి మరణానికి కారణంగా కావడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు రెకెత్తిస్తున్నాయి.
‘‘నేను నగలు పోయాయని మాత్రమే ఫిర్యాదు చేశాను’’ అని నికితా ‘ది ఫెడరల్’ తో మాట్లాడింది. ‘‘అజిత్ మరణించిన విషయం పోలీసులు చెప్పిన తరువాతే మాకు తెలిసింది. ఈ విషాద వార్త విని నేను నా తల్లి బాధపడ్డాము, ఈ పాపాన్ని ఎలా భరించగలం?’’ అని పేర్కొంది.
‘‘అయినప్పటికి ప్రజలు మా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. మాకు డీఎంకే తో సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఐఏఎస్ లతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
నిజం చెప్పాలంటే నేను డీఎంకే కార్యకర్తల వల్ల రూ. 2 లక్షలు పోగోట్టుకున్నాను. ఒకే రోజులో మా జీవితాలు తల్లకిందులయ్యాయి’’ అని నికితా పేర్కొంది.
రెండు మాటలు చెప్పిన నికితా..
శివగంగ జిల్లాలోని మాదపురం భద్రకాళీ అమ్మన్ ఆలయంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న 29 ఏళ్ల అజిత్ పై దొంగతనం ఆరోపణలు వచ్చాయి. జూన్ 27న తన కారు నుంచి గొలుసుతో పాటు 10 సావర్ల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయని నికితా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు వెంటనే అజిత్ ను అదుపులోకి తీసుకుని క్రూరంగా హింసించారు.
నికితా మొదట విడుదల చేసిన వీడియోలో వివరించిన వివరాల ప్రకారం.. ఆమె తన తల్లితో కలిసి ఆలయాన్ని దర్శించానని, ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా మెడికల్ స్కాన్ ను నిరాకరించి ముందుగా ప్రార్థన చేయాలని పట్టుబట్టిందని పేర్కొంది.
వీల్ చైర్ లో తమకు సాయం చేసిన అజిత్ రూ. 500 డిమాండ్ చేశాడని, తాము రూ. 100 చెల్లించానని తెలిపింది. తన కారు వద్దకు తిరిగి వచ్చేసరికి నగలు పోయాయని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.
అయితే దీనిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కానీ పోలీసులు మాత్రం అజిత్ ను అదుపులోకి తీసుకుని చిత్రవధ చేశారు. అతనిపై దారుణంగా దాడి చేసి మరణానికి కారణమయ్యారు.
పోలీసుల చర్యపై ప్రశ్నలు..
పోలీసుల చర్యలు ఇప్పటికే తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అజిత్ ను అదుపులోకి తీసుకునే ముందు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు.? పోలీస్ స్టేషన్ వెలుపల అతన్ని ఎందుకు విచారించారు. రెండు రోజుల్లో అతన్ని వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి విచారించడానికి పోలీసులకు ఎవరికి అధికారం ఇచ్చారు? పోస్ట్ మార్టం నివేదికను వెంటనే మేజిస్ట్రేట్ కు ఎందుకు పంపలేదు?
‘ది ఫెడరల్’కు లభించిన సమాచారం ప్రకారం.. దొంగతనం ఫిర్యాదు చేసిన నికితా 2011 లో తిరుమంగళం పోలీస్ స్టేషన్ లో జరిగిన మోసం కేసులో ప్రమేయం ఉందని వెల్లడైంది.
రాజాంగం అనే ఫిర్యాదుదారుడు, శివకామియమ్మాళ్, కలియా పెరుమాళ్, కవియరసు, సాకాదేవీ, భగత్ సింగ్ లతో సహ నికితా టీచర్ లేదా గ్రామ పరిపాలన అధికారి పదవులు ఇప్పిస్తామని హమీ ఇచ్చి తమ నుంచి రూ. 16 మోసం చేశారని, వీరికి అప్పటి ఉప ముఖ్యమంత్రి పీఏతో సంబంధాలు ప్రచారం చేసుకున్నారని కేసు నమోదు అయింది.
సెక్షన్ 420 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో నికితా ఐదో నిందితురాలిగా ఉంది. శివకామి అమ్మాళ్ ను ప్రాథమిక నిందితురాలిగా చేర్చారు. అయితే ప్రస్తుతం ఈ కేసు ఏ దశలో ఉందో తెలియట్లేదు.
ఎప్పటికప్పుడు మారుతున్న కథనాలు..
నికితా ఇటీవల ‘ది ఫెడరల్’ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రారంభంలో ఆమె ఆలయానికి ముందు ఉన్న స్కాన్ సెంటర్ ను సందర్శించానని, అక్కడ అభరణాలు తొలగించారని, తరువాత అవి కనిపించలేదని పేర్కొంది. ఇప్పుడు నేరుగా ఆలయానికి వెళ్లానని, స్కాన్ సెంటర్ ఆగడానికి నిరాకరించినట్లు రెండు వెర్షన్ లు వినిపిస్తున్నారు.
హిందూ మత, ధార్మిక శాఖకు చెందిన ఒక అధికారి తనకు సహయం చేశాడని కూడా ఆమె పేర్కొంది. కానీ తరువాత ముగ్గురు అధికారులు తనతో నాలుగు గంటలు ఉన్నారని తెలిపారు. పోలీసులపై ఎటువంటి ఒత్తిడి చేయలేదని నికితా తెలిపింది. తనకు ప్రభావం లేకపోవడం, ఐఏఎస్, ఐపీఎస్ కనెక్షన్లు లేని సాధారణ మధ్య తరగతి ప్రొఫెసర్ గా తన స్థితిని చెప్పారు.
కస్టడీలో జరిగిన ఈ మరణంపై ప్రజలు ఆగ్రహాన్ని రేకెత్తించింది. పెరుగుతున్న లాక్ ఆప్ మరణాలకు డీఎంకే ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు నిందిస్తున్నాయి. చెన్నై హైకోర్టు మధురై బెంచ్ తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది.
ఎఫ్ఐఆర్ లేకుండా అజిత్ ను ఎందుకు విచారించారు. ఈ దారుణమైన దాడి వెనక ఉద్దేశ్యం ఏమిటో పోలీసులు ఇంత దూకుడుగా వ్యవహరించడానికి ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారనే ప్రశ్నలు సంధించింది.
సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు..
నికితాకు ఐఏఎస్ సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నందున సచివాలయం నుంచి అనవసర ప్రభావం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ దీనిని నికితా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రత్యేక బృందానికి చెందిన ఐదుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి హత్య అభియోగం మోపారు. ఈ కేసులో మరో ఆరుగురిని సస్పెండ్ చేశారు.
శివగంగ ఎస్పీ ఆశిష్ రావత్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంచారు. మనమదురై డీఎస్పీ షణ్ముగ సుందరం ను సస్పెండ్ చేశారు. అజిత్ మరణాన్ని పోలీసులు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించడం, కేసు ను కప్పిపుచ్చే కుట్ర ఆరోపణలకు మరింత ఆజ్యం పోసింది.
కాలం గడిచిన కొద్ది అనేక కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణం ఏంటీ? పోలీసుల క్రూరమైన చర్యల వెనక ఉద్దేశ్యం ఏమిటీ? వ్యక్తిగత విభేదాలను పరిష్కరించడానికి నికితా ఫిర్యాదు కల్పితమా? విలువైన ఆభరణాలు లోపల ఉంటే నికితా తన కారును వాచ్ మెన్ కు ఎందుకు అప్పగించింది.? ఈ విషాదంలో రాజకీయ లేదా పరిపాలనా ఒత్తిడి ఏ పాత్ర పోషించింది?